అయితే నయనతార రీసెంట్ గా నటించిన కొన్ని తమిళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, ఆమె స్టార్ ఇమేజ్, సినిమాకు ఆమె తెచ్చే పబ్లిసిటీని చూసి నిర్మాతలు ఆమె డిమాండ్‌కు ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం నయనతార 'టెస్ట్', 'మన్నాంగట్టి సిన్స్ 1960' అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.