సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌డమ్‌ను అందుకుంది నయనతార. మొదట్లో కమర్షియల్ సినిమాల్లోనే నటించిన ఆమె, ఆ తర్వాత అరం, మాయ, డోరా, ఐరా వంటి స్త్రీ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి విజయం సాధించింది. దీంతో ఆమెకు లేడీ సూపర్‌స్టార్ అనే బిరుదు వచ్చింది.