వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా' మట్కా' రివ్యూ

First Published | Nov 14, 2024, 2:06 PM IST

1958 నుండి 1982 వరకు సాగిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ రకరకాల రెట్రో లుక్స్‌లో కనిపిస్తాడు. మట్కా కింగ్ గా మారి వాసు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి శత్రువులు కూడా ఏర్పడతారు.

Varun Tej, Matka Review, Gangster Film


సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్  విభిన్నమైన కథలు ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్‌తో కలసి మట్కా చేసారు.  మట్కా కింగ్ గా చెప్పబడే  రతన్ ఖేత్రీ స్ఫూర్తితో రూపొందించబడిన పీరియాడికల్ డ్రామా కావటంతో ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని భావించి చేసాడు.

1958 నుండి 1982 వరకు సాగిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ రకరకాల రెట్రో లుక్స్‌లో కనిపిస్తాడు.  ఎఫ్ 3 తో సక్సెస్ ని వెంకటేష్ తో షేర్ చసుకున్న వరణ్ తేజ్ మట్కాతో మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేసింది.  సినిమా ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూద్దాం.


స్టోరీ లైన్

కథా కాలం 1958- 1982. బర్మా శరణార్ది వాసు (వరుణ్ తేజ్). అతను వైజాగ్ శరణార్థి శిబిరంలో జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళతాడు. అక్కడే ఓ చిన్న సైజు రౌడీగా మారతాడు. జైలు నుంచి  బయటకు వచ్చి  పూర్ణ మార్కెట్టులో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్)  కొబ్బరికాయల కొట్టలో  పనికి చేరతాడు. అయితే అతనిలో తెలియని ఫైర్ ఉంటుంది. జీవితంలో ఎదగాలి అన్న కసి ఉంటుంది…ఈ క్రమంలో ఇల్లీగల్ బిజినెస్ లో దూరుతాడు. మట్కా ని పెద్ద బిజినెస్ లా విస్తరిస్తాడు. అలా మట్కా కింగ్ గా మారి వాసు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాడు…

ఈ క్రమంలో తనకి శత్రువులు కూడా ఏర్పడతారు. మరో ప్రక్క సుజాత (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో  పడతాడు. ఆమె నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. ఇక వాసు ప్రయాణంలో ఎంపీ నాని బాబు (కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) ఎలా ఎంటర్ అయ్యారు? వాసు మీద కన్నేసిన  సీబీఐ ఏం చేసింది? సాహు (నవీన్ చంద్ర) పట్టుకోగలిగాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 



ఎనాలసిస్ 

మట్కా ఓ రకంగా బయోపిక్ తరహా చిత్రం. ఇలాంటి సినిమా  చేయాలంటేనే  ఫార్మల్ రీసెర్చ్ అవసరం. అలాగే ఆ రీసెర్చ్ లో దొరికిన  మెటీరియల్ ని సినిమాకు ఎంతవరకూ వాడాలి అనేదే ఇక్కడ అసలైన టాస్క్.  ఎన్నో ఇంటర్వూలు చూడటం, ఆర్టికల్స్ చదవటం, జనాలతో మాట్లాడటం చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ గా చెప్పకపోయినా ఈ సినిమా మట్కా కింగ్ రతన్ ఖేత్రీ  జీవితం నుంచి తీసుకున్నదే.  

అయితే స్క్రిప్టుని బయోపిక్ లాగ రాయాలా, డాక్యుమెంట్  లాగ రాయాలా, కమర్షియల్ విషయాలతో కలిపి మసాలాతో ముడిపెట్టాలా అనేది డైరక్టర్ కు మరో టాస్క్.  వాస్తవానికి మట్కా సినిమా ఓ కమర్షియల్  బయోగ్రఫీని తలపిస్తుంది. కేజీఎఫ్, పుష్ప ఇలా నెగిటివ్ హీరోల సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా చేసారనిపిస్తుంది. అయితే ఆ పాత్రల్లో ఉన్న ఫైర్, లక్ష్యం పట్ల ఉండే నిబద్దత ఈ సినిమాలో కనపడదు. 
 


మట్కా లో ఫార్ములాగా  ఓ టెంప్లేట్ లో సీన్స్ వెళ్లిపోతూంటాయి. ఓ అతి సామాన్యుడు..అసామాన్యుడుగా ఎదగటం, ఈ క్రమంలో ఎదుర్కొనే అడ్డంకులు, అవకాశాలు, ఆనందాలు, అవహేళనలు ఇవే కథలో ముఖ్య భాగాలు.

మరీ సినిమాటెక్ గా అనిపించకపోవటానికి కారణం..నిజంగా జరిగిన యధార్ద సంఘటనల నుంచి ప్రేరణ పొందటమే. అయితే అదే సమయంలో ఆ సీన్స్ అన్ని familiar గా అనిపిస్తాయి. అవి ఎక్సైట్మెంట్ ని తగ్గించేసాయి. ఫస్టాఫ్ సెటప్ తో నడిచిపోయిందని సరిపెట్టుకున్నా సెకండాఫ్ సినిమా మాత్రం ఎక్కడా గూస్ బంప్స్ ఇచ్చే స్దాయిలో లేదు.

సీబీఐ సీన్స్, మట్కా కింగ్ గా వరుణ్ తేజ సీన్స్  అక్కడక్కడా ఆసక్తిగానే ఉన్నాయి. అయితే ఓవరాల్ ఆర్క్ దెబ్బ కొట్టింది. గాడ్ ఫాధర్ సినిమానుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్లు ఉన్న సీన్స్ చాలా స్లో నేరేషన్ లో నడిచి విసిగిస్తాయి. కిడ్నాపింగ్ లు,  ఫార్మాలా కాంపర్టేషన్స్ సినిమా విలువను తగ్గించుకుంటూ పోయాయి. సాంగ్, యాక్షన్ సీన్స్ ..వింటేజ్ ఫీల్ తీసుకొని వచ్చి ఉండవచ్చు కానీ దాని రొటీన్ నేరేషన్ నుంచి మాత్రం తప్పించలేకపోయాయి. ఇంట్రస్టింగ్ ప్రిమైజ్ ఉన్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవటం సినిమాని దెబ్బ కొట్టింది. 

Varun Tej, Kanaka Raju, Merlapaka Gandhi


టెక్నికల్ గా..

జీవి  ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల సీన్స్ ని లేపుతుంది. మరికొన్ని చోట్ల సీన్ ని మించిపోయి...ప్రక్కుకు తీసుకెళ్తుంది. పాటలు లేలే రాజా, తస్సాదియ్యా విజువల్ గా బాగున్నాయి. స్క్రీన్ ప్లే సినిమాపై ఆసక్తిని చంపేయటంతో దర్శకత్వ మెరుపులు ఏమీ హైలెట్ కాలేదు. వింటేజ్ ప్రొడక్షన్ డిజైన్, వరణ్ తేజ్ కు ఏజ్డ్ లుక్ ఇవ్వటం వంటివి బాగున్నాయి.  ఆ డిపార్టమెంట్స్ కష్టం కనిపిస్తుంది.


వరుణ్ తేజ్ కష్టం మాత్రం బాగా కనిపించింది. అతనికి కథ సహకరించలేదు. వేర్వేరు టైమ్ లలో వరుణ్ తేజ లుక్స్ బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా పాత్రకు తగ్గట్లు గంభీరంగా  బాగుంది. సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ చేసింది.

సోసోగా ఉంది సోఫియాగా  నోరా ఫతేహికాళ్లతో(డాన్స్ లు) కకుండా కళ్లతో (ఎక్సప్రెషన్స్ ) కష్టపడింది. పద్మగా సలోని డిఫరెంట్ గా కనపడింది. కిశోర్, జాన్ విజయ్, 'సత్యం' రాజేశ్, నవీన్ చంద్ర తదితరులు తమ తమ పాత్రలు తగ్గట్టు చేశారు.


ప్లస్ లు

అధెంటిక్ గా ఉన్న వింటేజ్ లుక్, స్టైల్
కొన్ని గాంబ్లింగ్ సీక్వెన్స్ లు  

మైనస్ లు 

ప్రెడిక్టుబుల్ గా సాగే కథనం, అవుట్ డేటెడ్ అనిపించే స్టోరీ టెల్లింగ్ 
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హై స్టేక్స్ లేకపోవటం,
 క్యారక్టర్ డవలప్మెంట్ సరిగ్గా జరగకపోవటం
  

ఫైనల్ థాట్

గాంబ్లింగ్ లో చాలా సార్లు ఓడిపోవటమే ఉంటుంది. మట్కా సినిమా చూడటం కూడా గాంబ్లింగ్ లాంటిదే అని చూసాక అర్దం అవుతుంది

----సూర్య ప్రకాష్ జోశ్యుల. 

Rating:2

Latest Videos

click me!