నటిగా 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న నయనతార, ఆమె కెరీర్ నిలబెట్టిన టాప్ 8 మూవీస్ ఇవే.. ఆ రెండూ లేకుంటే కష్టమే

Published : Oct 09, 2025, 11:41 AM IST

Nayanthara: నయనతారని స్టార్ హీరోయిన్ గా మార్చిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. చంద్రముఖి నుంచి జవాన్ వరకు ఆమె కెరీర్ లో బెస్ట్ మూవీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
19
నయనతార టాప్ 8 బెస్ట్ మూవీస్ 

నయనతార సౌత్ లో హైయెస్ట్ పైడ్ హీరోయిన్లలో ఒకరు. వయసు పెరిగే కొద్దీ నయన్ క్రేజ్ కూడా పెరుగుతోంది. 40 ప్లస్ లో నయనతార తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నయనతార నటిగా 22 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 22 ఏళ్ళ క్రితం ఆమె కెమెరా ముందుకు వచ్చిన క్షణాలని గుర్తు చేసుకున్నారు. 2003లో నయనతార 'మనస్సినక్కరే' అనే మలయాళీ చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. ఈ సందర్భంగా నయనతార కెరీర్ టాప్ మూవీస్, ఆమె కెరీర్ ని నిలబెట్టిన కొన్ని చిత్రాల గురించి చర్చ జరుగుతోంది. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

29
చంద్రముఖి 

నయనతార నటిగా ఎంట్రీ ఇచ్చింది 2003లో అయినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు లభించింది మాత్రం 2005లోనే. రజినీకాంత్ చంద్రముఖి చిత్రంలో హీరోయిన్ గా నటించడంతో నయన్ జాతకం మారిపోయింది. ఈ మూవీలో నయనతార అందంగా, హోమ్లీగా కనిపించి మెప్పించింది. 

39
గజినీ 

చంద్రముఖి విడుదలైన కొన్ని నెలలకే నయనతార నటించిన మురుగదాస్ దర్శకత్వంలోని గజినీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో నయన్ సెకండ్ హీరోయిన్. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చంద్రముఖి, గజినీ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో సౌత్ లో నయన్ పేరు మారుమోగింది. గజినీలో నయన్ తన గ్లామర్ యాంగిల్ కూడా బయట పెట్టింది. మొత్తంగా గజినీ, చంద్రముఖి చిత్రాలు నయనతార కెరీర్ కి బలమైన పునాది వేశాయి. 

49
బిల్లా

తమిళంలో అజిత్ కి జోడిగా నటించిన బిల్లా చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో నయనతార అప్పట్లోనే బికినీలో కనిపించడం సౌత్ లో పెద్ద సంచలనం అయింది.

59
లక్ష్మీ 

నయనతార తెలుగులో స్ట్రైట్ గా నటించిన తొలి చిత్రం లక్ష్మీ. వెంకటేష్, వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. గజినీ, చంద్రముఖి చిత్రాలతో అప్పటికే తెలుగులో నయన్ కి పాపులారిటీ ఉంది. లక్ష్మీ కూడా సూపర్ హిట్ కావడంతో నయన్ టాలీవుడ్ లో సైతం స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

69
అదుర్స్

వివి వినాయక్ దర్శకత్వంలో నయనతార నటించిన మరో మూవీ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ తో ఈ మూవీలో నయనతార కెమిస్ట్రీ బాగా కుదిరింది. అప్పటికి ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్.

79
సింహా

ఈ చిత్రం బాలకృష్ణకి కంబ్యాక్ మూవీ. ఈ చిత్రంలో నయనతార పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ సూపర్ హిట్ కావడం మాత్రమే కాదు 3 నంది అవార్డులు కూడా అందుకుంది.

89
రాజా రాణి 

స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇది డెబ్యూ మూవీ. ప్రేమలో విఫలమైన ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని ఎలా జీవించారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఎమోషనల్ సన్నివేశాల్లో నయనతార తన నటనతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి గాను నయనతార ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ అవార్డు, విజయ్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. 

99
జవాన్

నయనతార అట్లీ దర్శకత్వంలో నటించిన మరో మూవీ జవాన్. ఈ మూవీలో ఆమె షారుఖ్ కి జోడిగా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో జవాన్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories