వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన స్టార్ హీరోయిన్ అరుదైన ఫోటో.. చిన్నప్పుడు ఎంత చబ్బీగా ఉందో..

First Published | Nov 5, 2024, 7:45 PM IST

అక్కడ తన తొలి సినిమాతోనే వెయ్యి కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన ప్రముఖ నటి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరు? ఆ కథేంటో చూద్దాం. 

తమిళ సినిమాల్లో వెయ్యి కోట్ల వసూళ్లు అంటే రజినీ, విజయ్, కమల్, అజిత్ లాంటి స్టార్ హీరోలకే అందని ద్రాక్షలా ఉంటుంది. కానీ కోలీవుడ్ హీరోయిన్ ఒకరు తన తొలి సినిమాతోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ నటి చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ నటి ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నయనతార చిన్ననాటి ఫోటో

ఆ నటి మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. బాలీవుడ్ లో తన తొలి సినిమాతోనే వెయ్యి కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. గతేడాది బాలీవుడ్ లో విడుదలైన `జవాన్` సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నయనతార. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లు వసూలు చేసింది.


నయనతార అరుదైన చిన్ననాటి ఫోటో

నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల కోసం తన పేరు మార్చుకుంది. కాలక్రమేణా అదే ఆమె గుర్తింపుగా మారింది. `అయ్యా` సినిమాతో కోలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన నయనతార, ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన నటించి తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

లేడీ సూపర్ స్టార్ నయనతార

లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌ `ఐరా`, `ముకుతి అమ్మన్` వంటి సినిమాల విజయాలతో ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. నయనతారకు ఇప్పుడు 40 ఏళ్లు దాటినా, సినిమాల్లో ఆమెకు డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం అరడజను సినిమాలతో కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

నయనతార సినిమాలు

ప్రస్తుతం ఆమె తమిళంలో `మన్నాంగట్టి` సినిమాలో నటిస్తోంది. శశికాంత్ దర్శకత్వంలో ఆమె నటించిన `టెస్ట్` సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో నివిన్ పౌలీతో `డియర్ స్టూడెంట్స్`, కన్నడలో యష్ కు అక్కగా `టాక్సిక్`, తమిళంలో కవిన్ కు జంటగా `హాయ్` వంటి సినిమాల్లో నటిస్తోంది.

నయనతార కుటుంబం

నటి నయనతారకు సినిమా ద్వారా దక్కిన ఆస్తి విఘ్నేష్ శివన్. `నానమ్ రౌడీ ధాన్` సినిమాలో నటించినప్పుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయన్, దాదాపు 7 ఏళ్ల ప్రేమ తర్వాత 2022లో విక్కీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఉయిర్, ఉలక్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. సరోగసీ ద్వారా ఈ ఇద్దరు కవల పిల్లలను కన్నారు విక్కీ - నయన్ జంట.

read more: బాలయ్య ముందు అన్న సూర్య ఇజ్జత్‌ తీసిన కార్తి.. జ్యోతిక రహస్యాలు తమ్ముడితో చెబుతాడా?

also read: లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య.. `తండేల్‌` వచ్చేది అప్పుడే !

Latest Videos

click me!