బాలయ్య ముందు అన్న సూర్య ఇజ్జత్‌ తీసిన కార్తి.. జ్యోతిక రహస్యాలు తమ్ముడితో చెబుతాడా?

First Published | Nov 5, 2024, 6:47 PM IST

హీరో కార్తీ తన అన్నయ్య సూర్య పరువంతా తీసేశాడు. అది కూడా బాలకృష్ణ ముందు. అసలు రహస్యాలన్నీ బయటపెట్టేశాడు. దీంతో సూర్య అందరికి ముందు తలెత్తుకోలేకపోయాడు. 

photo credit-aha unstoppable 4

హీరో సూర్య, కార్తీలు తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. సూర్య కంటే కార్తీనే తెలుగు ఆడియెన్స్ ఓన్‌ చేసుకుంటారు. తెలుగుహీరోగానే అభిమానిస్తారు. ఆయన సినిమాలను ఆదరిస్తారు. ఇటీవల కార్తి `సత్యం సుందరం` సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సూర్య `కంగువా`తో రాబోతున్నారు. ఈ నెల 14న ఈ మూవీ విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌ లో ఇటీవల సూర్య సందడి చేశారు. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

photo credit-aha unstoppable 4

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొన్నారు. అంతేకాదు ఏపీలోనూ సందడి చేశారు సూర్య. దీంతోపాటు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌ స్టాపబుల్‌` సీజన్‌ 4 షోలో పాల్గొన్నారు. సింగం, సింహం కలిస్తే ఎలా ఉంటుంది? రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఈ షోలోనూ ఇద్దరు వేరే స్థాయిలో రచ్చ చేశారు. ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సూర్యని బాలయ్య ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆటపట్టించారు. కామెడీ చేశారు. 


photo credit-aha unstoppable 4

వచ్చీ రావడంతోనే సీట్లో కూర్చునే విషయంలో ఫన్‌ చేశారు బాలయ్య. సూర్యగారు కొద్దిగా కంఫర్ట్ గా ఫీలవుతున్నారు అనగా, కంప్లీట్‌గా సర్‌ అని చెప్పగా, అది నాకు ఇష్టం లేదని బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత మీ తమ్ముడు కార్తి ఫోన్‌లో మీ నెంబర్‌ ఏమని సేవ్‌ చేసుకుంటారని బాలయ్య ప్రశ్నించగా, ఫస్ట్ క్వచ్చన్‌ ఔట్‌ ఆఫ్‌ ది సెలబస్‌ అంటూ సూర్య చెప్పడం అరే అన్నదమ్ముల అనుబంధం అని చెప్పడంతో నవ్వులు విరిస్తాయి. అదే సమయంలో సూర్య గాలి తీసినంత పనైంది. అనంతరం మీ ఇద్దరికి గొడవ అయిన లాస్ట్ టాపిక్ ఏది అని అడగ్గా, నిజం చెప్పాలా, లేదా అబద్దం చెప్పాలా? అని సూర్య రియాక్ట్ అయ్యాడు. దీనికి బాలయ్య సీరియస్‌గా లేచి వచ్చి సూర్యని దగ్గరగా చూశారు. దీనికి సూర్య రియాక్ట్ కాగా, చివరికి ఐ లవ్యూ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీంతో సూర్య ఊపిరి పీల్చుకున్నారు. 
 

photo credit-aha unstoppable 4

అనంతరం ఫస్ట్ క్రష్‌ అన్నాడు బాలయ్య. దెబ్బకి సూర్య మొహం చాటేశాడు. సర్‌ వద్దు సర్‌, ప్రాబ్లమ్‌ సర్‌, ఇంటికి వెళ్లాలి సర్‌ అని చెప్పడం విశేషం. అనంతరం ఏకంగా కార్తీకి ఫోన్‌ చేశారు. ఇప్పుడు మీ అన్నయ్య చాలా అబద్దాలు ఆడాడయ్యా అని బాలయ్య చెప్పగా, చిన్నప్పట్నుంచి అంతే సార్‌ అని కార్తీ చేయడంతో సూర్య పరువంతా పోయింది. సేమ్‌ ఆన్సర కార్తీ నో ఛేంజ్‌ అని సూర్య చెప్పడం విశేషం. దీంతో ఫోన్‌ పగలకొడతా అని బాలయ్య రియాక్ట్ అయ్యారు, తర్వాత ఓ నాదా అని చెప్పడం నవ్వులు పూయించింది. ఇక మరో ప్రశ్నకి బాలయ్య కి పంచ్‌ పడినట్టుగా సూర్య రియాక్ట్ అయ్యారు. అంతేకాదు పెద్దగానే ఇరికించారు కార్తీ. ఓ హీరోయిన్‌ అంటే చాలా ఇష్టం సర్‌ అని తెలిపారు కార్తీ. దీనికి బాలయ్య.. చాలు చాలు నాకిది రేపు న్యూస్‌ పేపర్స్ అదిరిపోతాయి అని బాలయ్య చిటికేలేశారు. అనంతరం సూర్య స్పందిస్తూ నువ్వు కత్తిరా, కార్తీ కాదు అని చెప్పడంతో ఘొళ్లున నవ్వారు బాలయ్య. 
 

photo credit-aha unstoppable 4

అనంతరం కొన్ని సీక్రెట్స్ ఎవరికితో షేర్‌ చేసుకుంటావ్‌, కార్తీతోనా, జ్యోతికతోనా అని చెప్పడంతో బాలయ్య సూర్య హార్ట్ ని చెక్‌ చేయగా, తనగుండె 240 సార్లు కొట్టుకుంటుంది సర్‌ అని చెప్పగా, బాలయ్య.. అదేంటి జ్యోతిక జ్యోతిక అంటుందని చెప్పారు. అయితే కార్తీకి సంబంధించిన విషయాలు జ్యోతికతో, జ్యోతిక రహస్యాలు... అని చెప్పి సస్పెన్స్ లో పెట్టాడు. భార్య జ్యోతిక రహస్యాలు కార్తీతో పంచుకుంటాడా అనే అనుమానం కలిగించేలా చెప్పి వదిలేశారు. అనంతరం జ్యోతిక లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేకపోతున్నా అని చెప్పి స్టేజ్‌ మీద నుంచే లవ్‌ ఎక్స్ ప్రెస్‌ చేశాడు సూర్య. 
 

photo credit-aha unstoppable 4

ఇంత వరకు ఫన్నీగా జరిగిన షోలో ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారింది. చిన్న పిల్లలు తమ హెల్త్ సమస్యలు గురించి చెప్పినప్పుడు సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను తన అగరం ఫౌండేషన్‌ ద్వారా చాలా మంది అనాథలను చదివిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఆడియెన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలయ్య సైతం ఎమోషల్‌గా కనిపించడం విశేం. 

read more: సావిత్రిపై మనసు పడ్డ పొలిటీషియన్‌.. ఆయన వల్లే మహానటి జీవితం నాశనం అయ్యిందా? సంచలన నిజాలు

also read: చిరంజీవిపై కసితో అన్నం మానేసిన బాలయ్య, చివరికి ఎన్బీకే డాన్స్ నే మెగాస్టార్‌ రీమిక్స్ చేసిన పరిస్థితి

Latest Videos

click me!