3 గంటల్లో 21 పాటలు మ్యాజిక్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇళయరాజా

First Published | Nov 5, 2024, 6:15 PM IST

ఇప్పటి కాలంలో ఒక్క పాటకి ట్యూన్ కంపోజ్ చేయడానికే చాలా రోజులు పడుతుంది. అలాంటిది ఇళయరాజా.. చాలా తక్కువ టైమ్ లో ఓ అరుదైన రికార్డ్ ను క్రిమేట్ చేశాడు. ఇంతకీ ఏంటది. 

ఇళయరాజా

మ్యూజిక్ రంగంలో 48 ఏళ్లుగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు ఇళయరాజా. వెయ్యికి పైగా సినిమాలకు, 7000 పాటలకు సంగీతం అందించి 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. 20,000కు పైగా సంగీత కచేరీలు నిర్వహించారు. ఎం.ఎస్.విశ్వనాథన్ తర్వాత తమిళ సినీ లోకంలో అంతటి పేరు ప్రఖ్యాతులున్న సంగీత దర్శకుడు ఇళయరాజా.

Also Read: గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడా..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

ఇళయరాజా

ఇప్పుడు ఒక్క పాట కంపోజ్ చేయడమే కష్టంగా ఉంది. కానీ 1980లలో ఇళయరాజా ఒక్క రోజులోనే చాలా సినిమాలకు సంగీతం అందించేవారు. ఒకరోజు ఉదయం 6 నుంచి 9 గంటల లోపు 3 సినిమాలకు 21 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేసి ముగ్గురు దర్శకులను ఆశ్చర్యపరిచారు. 1991 సంక్రాంతికి విడుదలైన  సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించారు.

Also Read: రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పిన అసలు నిజం


ఇళయరాజా పాటలు

మోహిని, శివసుబ్రమణ్యం నటించిన ఈ సినిమాలో పెద్దగా స్టార్లు లేకపోయినా సూపర్ హిట్ అయ్యింది. కారణం ఇళయరాజా అందించిన 7 పాటలు. తెలుగు తమిళంలో ఆయన  పాటలు ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. . ఒకరోజు ఉదయం దర్శకుడు కె.ఆర్. ఇళయరాజాను కలిసినప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే 7 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేశారు.

ఇళయరాజా మ్యూజిక్

అదే రోజు దర్శకులు భారతీరాజా, ప్రతాప్ పోతన్ లను కూడా రమ్మన్నారట ఇళయరాజా. వాళ్ళ సినిమాలకు కూడా అదే రోజు సంగీతం ఇవ్వాలని అన్నారు.  తర్వాత 3 గంటల్లోనే ప్రతాప్ పోతన్ " భారతీరాజా " సినిమాలకు కూడా సంగీతం అందించారు. మొత్తం 3 గంటల్లో 3 సినిమాలకు 21 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఇలా చేయగల సంగీత దర్శకుడు ఇప్పటి వరకూ ఎవరూ లేరు అనే చెప్పాలి. 

Latest Videos

click me!