Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?

Published : Mar 07, 2026, 12:51 PM IST

సౌత్  స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో  ఓ లగ్జరీ 4BHK ఇల్లు కొన్నారట. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల పక్కనే ఉన్న కొత్త ఇంట్లోకి  ఈ దంపతులు వెళ్తున్నారని సమాచారం. ఆ ఇంటి విశేషాలు ఏంటంటే? 

PREV
15
లేడీ సూపర్ స్టార్ గా నయనతార..

నయనతార తన కెరీర్‌ను తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ప్రారంభించి, ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తన నటన, కమర్షియల్ విజయాలతో 'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

25
నయనతార ‌- విఘ్నేష్ శివన్ హ్యాపీ లైఫ్..
దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడిన నయనతారకు ఉయిర్, ఉలగ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. నయన్ త్వరలో 'మూకుత్తి అమ్మన్ 2', 'మన్నంగట్టి', 'టాక్సిక్' వంటి సినిమాల్లో కనిపించనున్నారు.
35
పోయెస్ గార్డెన్‌లో ఇల్లంటే..

చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనడం సినీ సెలబ్రిటీలకు ఓ గౌరవం. మన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాగా.. చెన్నైలో పోయోస్ గార్గెన్ అలాగ. రజినీకాంత్, ధనుష్, దివంగత జయలలిత వంటి ప్రముఖుల ఇళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ భూమి విలువ చాలా ఎక్కువ కాబట్టి, జనసాంద్రత తక్కువగా ఉంటుంది.

45
నయనతాకు ఎక్కడెక్కడ ఇళ్లున్నాయంటే?
నయనతార పలు భాషల్లో నటిస్తుండటంతో, షూటింగ్‌ల కోసం వెళ్లిన ప్రతిచోటా ఓ ఇల్లు కొన్నారని టాక్. కేరళ, చెన్నై, హైదరాబాద్‌లలో ఆమెకు సొంత ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే పోయెస్ గార్డెన్‌లో ఓ ఇల్లు ఉండగా, ఇప్పుడు రూ.31 కోట్లతో మరో కొత్త ఇంటిని కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
55
త్వరలోనే గృహప్రవేశం..?
జాప్‌కీ (Zapkey) సంస్థ యాక్సెస్ చేసిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ ఇల్లు 'లెగసీ' ప్రాజెక్టులో భాగం. ఇది 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 4BHK డూప్లెక్స్ అపార్ట్‌మెంట్. దీని విలువ రూ.31.5 కోట్లు. నయన్-విఘ్నేష్ జంట త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారని సమాచారం.
Read more Photos on
click me!

Recommended Stories