Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు

Published : Mar 07, 2026, 11:59 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి, కమల్‌ హాసన్‌, ఆర్‌ నారాయణమూర్తి, సుద్ధాల అశోక్‌ తేజకి గద్దర్‌ అవార్డులు వరించాయి. స్పెషల్‌ జ్యూరీ కింద వీరికి ప్రత్యేకంగా ప్రముఖుల పేర్లతో నెలకొల్పిన గద్దర్‌ అవార్డులకు ఎంపిక చేశారు. 

PREV
13
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు 2025

గద్దర్‌ అవార్డుల ప్రకటన వచ్చింది. 2025 ఏడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ దిల్‌ రాజు. ఇందులో చిరంజీవి, కమల్‌ హాసన్‌, జయసుధ, ఆర్‌ నారాయణమూర్తి, అశ్వినీదత్‌, రమేష్‌ ప్రసాద్‌, సుద్ధాల అశోక్‌ తేజలకు ప్రత్యేక అవార్డులు వరించాయి. ఎన్టీఆర్‌ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేవారు. అలగే పైడి జయరాజ్‌ అవార్డుకి కమల్‌ హాసన్‌ని ఎంపిక చేశారు. అక్కినేని అవార్డుకి జయసుధని ఎంపిక చేయడ విశేషం.

23
గద్దర్‌ అవార్డులను ప్రకటించిన దిల్‌ రాజు

ఇక నాగిరెడ్డి చక్రపాణి అవార్డు నిర్మాత అశ్వనీదత్‌కి వరించగా, సినారె అవార్డు సుద్ధాల అశోక్‌ తేజకి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్‌ ప్రసాద్‌కి, కాంతారావు అవార్డుకి ఆర్‌ నారాయణమూర్తిని ఎంపిక చేశారు. బీఎన్‌ రెడ్డి ఫిల్మ్ అవార్డుకి సింగీతం శ్రీనివాసరావుని ఎంపిక చేయడం విశేషం. తెలుగు సినిమా అభివృద్ధికి దోహదపడ్డ మన సినీ దిగ్గజాల పేరుతో అవార్డులను ప్రకటించారు. ఈ సారి కొత్తగా వీటిని ప్రకటించారు.

33
మార్చి 19న గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

గతేడాది విడుదలైన అవార్డులకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి ఛైర్మెన్‌గా ఎంపికైన జ్యూరీ కమిటీ ఈ అవార్డులను నిర్ణయించింది. మార్చి 19న ఈ గద్దర్‌ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories