ఎంట్రీతోనే రెమ్యూనరేషన్‌ డబుల్‌.. సౌత్‌లో ఆ రికార్డ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారదే..

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్‌లోనూ షాక్‌ ఇస్తుంది. పారితోషికాన్ని ఏకంగా డబుల్‌ చేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని అందుకుంటున్న హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది.

కెరీర్‌ బిగినింగ్‌లో గ్లామర్‌ రోల్స్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కించిన నయతార ఇటీవల ట్రెండ్‌ మార్చింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది.
నయతార సినిమాలు స్టార్‌ హీరోలకు ధీటుగా కలెక్షన్లని రాబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడికి ఉన్న క్రేజ్‌ అలాంటిది. అద్భుతమైన నటనతో సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేస్తూ కలెక్షన్ల పంట పండిస్తుంది నయనతార.

తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది. తమిళ దర్శకుడు అట్లీ.. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా హిందీలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నయనతారని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
దీనికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఈ సినిమాకి నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ సినిమాకి గానూ ఆమె ఏకంగా దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట.
ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి నిడివి, బడ్జెట్‌ని బట్టి 3 నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా డబుల్‌ చేసిందట. బాలీవుడ్‌లో హీరోయిన్లకి భారీగానే పారితోషికం ఉంటుంది. అదే సమయంలో భారీ బడ్జెట్‌ సినిమా కావడం ఆ స్థాయిలో పారితోషికం ఇస్తుంటారు. షారూఖ్‌ సినిమాలో నయన్‌ది చాలా ప్రయారిటీ ఉన్న పాత్ర అని, అందుకే నయన్‌ ఆ రేంజ్‌తో డిమాండ్‌ చేస్తుందని సమాచారం.
నయన్‌ డిమాండ్‌ని చూసి హిందీ నిర్మాతలు షాక్‌ అవుతున్నారట. నయనతార పాత్రకి ప్రయారిటీ ఉండటం వల్ల నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, 6 నుంచి 8కోట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఇదే నిజమైతే ఇంతటి భారీ పారితోషికాన్ని అందుకుంటున్న సౌత్‌ హీరోయిన్‌గా రికార్డ్ సృష్టిస్తుంది నయన్‌. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీతోనే ఇంతటి భారీ పారితోషికాన్ని అందుకోబోతున్న సౌత్‌ హీరోయిన్‌గానూ రికార్డ్ సృష్టించబోతుంది.
నయనతార సినిమాలతోపాటు ప్రేమలోనూ బిజీగా ఉంది. ఆమె దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో గత కొంత కాలంగా ఘాటైన ప్రేమలో మునిగితేలుతుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో సమంత, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది.

Latest Videos

click me!