మా ఫ్యామిలీలో కొన్ని తప్పులు జరిగాయి..కానీ పవిత్ర చాలా మంచి వ్యక్తి, నరేష్ తనయుడి షాకింగ్ కామెంట్స్

Published : Aug 23, 2023, 03:22 PM IST

నవీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలిలో జరుగుతున్న సంఘటనలపై నవీన్ రెండు విధాలుగా కామెంట్స్ చేసారు. 

PREV
16
మా ఫ్యామిలీలో కొన్ని తప్పులు జరిగాయి..కానీ పవిత్ర చాలా మంచి వ్యక్తి, నరేష్ తనయుడి షాకింగ్ కామెంట్స్

సౌత్ లో సంచలనం సృష్టించిన లవ్ బర్డ్స్ నరేష్, పవిత్ర. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు, వ్యక్తిగత వివాదాలు సహజమే. కానీ వీళ్లిద్దరి వ్యవహారం వేరు. 60 ప్లస్ లో ఉన్న నరేష్.. 40 ప్లస్ లో ఉన్న పవిత్ర మధ్య ఘాటు ఎఫైర్ మొదలయింది. ఆ తర్వాత నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య ఎలాంటి వివాదం చెలరేగిందో అంతా చూశారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్, పవిత్ర మైసూరులో హోటల్ గదిలో ఉండగా రమ్య రఘుపతి అక్కడికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. 

 

26

ఇలా వివాదాలతోనే నరేష్, పవిత్ర ప్రేమ సాగుతోంది. అలాగే రమ్య రఘుపతితో వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల రమ్య రఘుపతి విషయంలో నరేష్ కి అనుకూలంగా  కోర్టు తీర్పు ఇచ్చింది. నరేష్ వ్యవహారాల్లో రమ్య జోక్యం చేసుకోకూడదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

 

36
Naresh - Pavitra Lokesh

ఇదిలా ఉండగా రమ్యతో విభేదాలు, పవిత్ర లోకేష్ ప్రేమ లాంటి సంఘటనతో నరేష్ తరచుగా వార్తల్లో ఉంటున్నారు. నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ షార్ట్ ఫిలిమ్స్ తో దర్శకుడిగా మారారు. రీసెంట్ గా నవీన్.. తన స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ తో సత్య అనే వీడియో సాంగ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో నవీన్ కి మంచి గుర్తింపు లభించింది. 

 

46

అయితే నవీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలిలో జరుగుతున్న సంఘటనలపై నవీన్ రెండు విధాలుగా కామెంట్స్ చేసారు. తప్పులు జరిగాయి అంటూనే తన తండ్రికి సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలిలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. పక్క వాళ్లపై ఆధారపడడం ఉండదు. మా ఫ్యామిలిలో ఎప్పుడూ ఇదే జరుగుతోంది. 

 

56

మా ఫ్యామిలిలో కొన్ని తప్పులు జరిగాయి. మా కుటుంబం గురించి ఎవరు ఎన్ని వాగినా పట్టించుకోలేదు. చెడుగా ఫీల్ కాలేదు. అందరికి నచ్చే విధంగా ఒక కుటుంబం ఉండాలంటే అది కష్టం. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం అని నవీన్ అన్నారు.

 

66

పవిత్ర లోకేష్ తో నాకు పరిచయం ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. నేను ఎలాంటి ప్రాజెక్ట్ చేసినా ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడతారు. ఆమెని నేను పవిత్ర గారు అని పిస్తాను. నాన్న గురించి చాలా  మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ తనపని తాను చేసుకుంటూ వెళతారు. నాన్నలో నాకు నచ్చే విషయం అదే అని నవీన్ అన్నారు. 

 

click me!

Recommended Stories