ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్య కెరీర్లో ఎదుర్కొన్న కష్టనష్టాలు గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో బాల్యం నుండి ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశారు. పదో తరగతి చదివే రోజుల్లోనే కుటుంబ బాధ్యత తీసుకున్నాను. నాకు తెలిసింది డాన్స్ ఒక్కటే. పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షన్స్ లో డాన్స్ చేసేదాన్ని. అందుకు నాకు రూ. 700 ఇచ్చేవారు.