Naveen Polishetty: అదిరిపోయే సినిమా చేయాలనుకున్నా.. ఈ ఘటన నా లైఫ్‌నే మార్చేసింది.. నవీన్‌ పొలిశెట్టి ఎమోషనల్‌

Published : Dec 31, 2025, 09:12 PM IST

కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు మరో మూవీతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆయన `అనగనగా ఒక రాజు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. 

PREV
15
నవీన్‌ పొలిశెట్టి స్ట్రగుల్స్

కామెడీ చిత్రాలతో అలరిస్తున్నారు నవీన్‌ పొలిశెట్టి. తనలోని కామెడీ యాంగిల్‌ని బయటకు తీస్తూ మెప్పిస్తున్నారు. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లని అందుకున్నారు. హ్యాట్రిక్ హిట్‌ కొట్టాడు. అదే జోరులో మరో అదిరిపోయే సినిమాతో రావాలనుకున్నారు. కానీ యాక్సిడెంట్‌ ఆయనకు గట్టిగా బ్రేకులు వేసింది. దీంతో ఒక్కసారిగా లైఫ్‌ తలక్రిందులయ్యిందట. ఆ ఘటన గురించి పంచుకున్నారు నవీన్‌ పొలిశెట్టి.

25
అనగనగా ఒక రాజు చిత్రంతో సంక్రాంతికి వస్తోన్న నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు `అనగనగా ఒక రాజు` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేసింది. మారి దర్శకుడు. ఆయనకిది తొలి చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజుగారి పెళ్లి రిసెప్షన్‌ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు.

35
యాక్సిడెంట్‌తో అంతా తలక్రిందులు

ఇందులో నవీన్‌ పొలిశెట్టి తన స్ట్రగుల్స్ ని పంచుకున్నారు. `అనగనగా ఒక రాజు` మూవీ డిలేకి కారణం చెప్పారు. ఆ సమయంలో తాను ఎలాంటి ఇబ్బంది పడ్డాడో తెలిపారు. నవీన్‌ మాట్లాడుతూ, `2024 అనేది నా జీవితంలో క్లిష్టమైన సంవత్సరం. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నా. కానీ ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అదే టైమ్‌లో మా టీమ్‌తో కలిసి ఈ 'అనగనగా ఒక రాజు' కథ రాసుకున్నా. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాము. ఆ సమయంలో 'అన్నా సినిమా ఎప్పుడు?' అని చాలా మంది మెసేజ్ లు చేశారు. మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. మీకు అందరికి కృతజ్ఞతలు` అని తెలిపారు.

45
ప్రభాస్‌, చిరంజీవి సినిమాలు కూడా ఆడాలి

ఆయన ఇంకా చెబుతూ, `సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతటి వినోదాత్మక చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే.. సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాము. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది.  జనవరి 14న విడుదలవుతున్న 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నాము. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి `మన శంకర వరప్రసాద్ గారు`, ప్రభాస్ 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని తెలిపారు నవీన్‌.

55
సంక్రాంతికి నా మూడో సినిమా - మీనాక్షి చౌదరీ

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. `ఇది నా మూడో సంక్రాంతి సినిమా. `అనగనగా ఒక రాజు`లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను` అని అన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories