నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయుడు షూటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్టర్ బి గోపాల్ ఓ సందేహం వ్యక్తం చేయగా బాలయ్య చెప్పి మరీ తన సత్తా చాటారు. ఆ వివరాలు ఈ కథనంలో..
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేవి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు. ఈ రెండు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. రెండు చిత్రాలకు దర్శకుడు బి గోపాల్ కావడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ నరసింహ నాయుడు మూవీ అన్ నోన్ ఫ్యాక్ట్స్ ని బయట పెట్టారు.
25
స్క్రీన్ మీద చూస్తారుగా
సాధారణంగా ఈ సీన్ బాలకృష్ణ ఎలా చేయగలరు అని సందేహం వ్యక్తం చేస్తే.. చేసి చూపించడం తనకు అలవాటు అని బాలయ్య అన్నారు. బాలకృష్ణ గతంలో భారీ పౌరాణిక చిత్రం నర్తనశాల ప్రారంభించారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ మూవీలో బాలయ్య అర్జునుడిగా, కీచకుడిగా రెండు పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. భీముడిగా శ్రీహరిని ఎంచుకున్నారు. శ్రీహరి మంచి కటౌట్, కండలు ఉన్న నటుడు. శ్రీహరి ముందు బాలయ్య ఎలా సరిపోతారు అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారట. కానీ స్క్రీన్ మీద చూస్తారుగా అని బాలయ్య ఊరుకున్నారు.
35
సింహాచలంలో నరసింహనాయుడు షూటింగ్
అదే విధంగా నరసింహ నాయుడు సినిమాలో కూడా డైరెక్టర్ బి గోపాల్ బాలయ్యపై సందేహం వ్యక్తం చేశారట. నరసింహ నాయుడు మూవీలో ఓ యాక్షన్ సీన్ ని సింహాచలంలో షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్ కి కొంతమంది ఫైటర్స్, ఆర్టిస్టులు అవసరం. దీనితో లోకల్ గా ఉన్నవారిని ప్రొడక్షన్ టీమ్ తీసుకువచ్చింది. వాళ్లంతా బాడీ బిల్డర్లు, భారీ కటౌట్ లతో ఉన్నారు. ఆ ఆర్టిస్టులు అంతా బాలకృష్ణ సినిమా అని ఎంతో ఉత్సాహంగా వచ్చారు.
డైరెక్టర్ బి గోపాల్ కి వాళ్ళని చూడగానే అనుమానం కలిగింది. అంత పెద్ద బాడీ బిల్డర్ల మధ్య బాలయ్య కనిపిస్తారా అనేది ఆయన అనుమానం. వెంటనే బాలయ్య వద్దకు వెళ్లి విషయం చెప్పేందుకు సందేహిస్తున్నారు. పర్లేదు చెప్పండి అని తాను అన్నట్లు బాలయ్య తెలిపారు. బి గోపాల్ మాట్లాడుతూ.. బాబు వాళ్ళు భారీ శరీరాలతో ఉన్నారు. వాళ్ళ మధ్య మీరు ఆనరు. వెనక్కి పంపించేద్దాం అని అన్నారు. వెంటనే బాలయ్య స్పందిస్తూ.. ఆర్టిస్టులని అలా వెనక్కి పంపడం మంచిది కాదు.
55
చెలరేగిన బాలయ్య
వాళ్ళ మధ్య నేను కనిపిస్తానో లేదో అనే సందేహమా.. ఆ సంగతి నాకు వదిలేయ్. నేను ఎలా కనిపిస్తానో స్క్రీన్ పై చూడు అని బాలయ్య గోపాల్ కి చెప్పారు. చెప్పినట్లుగానే ఆ ఫైట్ లో బాలయ్య అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ పై వన్ మాన్ షో చూస్తున్నట్లు ఉంటుంది. అంత పెద్ద బాడీ బిల్డర్లు కూడా బాలయ్య చెలరేగుతుంటే నిజంగానే భయపడిపోయారట. ఏ సన్నివేశంలో ఎలా కనిపించాలి, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనేది తనకు బాగా తెలుసు అని బాలయ్య తెలిపారు. మొత్తంగా నరసింహ నాయుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.