నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంతో దెబ్బతిన్న బెబ్బులిలా బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నాడు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దసరా దూసుకుపోతోంది. అన్ని ఏరియాల నుంచి దసరా చిత్రానికి యునానిమస్ హిట్ టాక్ లభిస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంతో దెబ్బతిన్న బెబ్బులిలా బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నాడు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దసరా దూసుకుపోతోంది. అన్ని ఏరియాల నుంచి దసరా చిత్రానికి యునానిమస్ హిట్ టాక్ లభిస్తోంది. గతంలో ఎప్పుడూ నాని ఇలా పల్లెటూరి నేపథ్యంలో అసలు సిసలైన నాటు కథలో నటించలేదు.
26
ఇప్పటి వారకు సాఫ్ట్ రోల్స్ లో నటిస్తూ వచ్చిన నాని తొలిసారి ఊరమాస్ పాత్ర చిక్కడంతో చెలరేగిపోయాడు. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే కుంభస్థలాన్ని కొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన నటించిన కీర్తి సురేష్ నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యానికి గురయ్యేలా దసరా బాక్సాఫీస్ నంబర్స్ నమోదవుతున్నాయి.
36
తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండవరోజు ఆ సంఖ్య 53 కోట్లకు చేరింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. దసరా ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఉందొ అని. చాలా ఏరియాల్లో దసరా కలెక్షన్స్ స్టార్ హీరోల చిత్రాల్ని అధికమిస్తూ రికార్డు సృష్టిస్తున్నాయి.
46
యుఎస్ లో దసరా చిత్రం నాని కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ అధికమించింది. యుఎస్ లో ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీనితో నాని అరుదైన రికార్డ్ సాధించాడు. యుఎస్ లో అత్యధిక 1 మిలియన్ చిత్రాలు కలిగిన టాలీవుడ్ హీరోల జాబితాలో మహేష్ బాబు తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు.
56
రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లని అధికమిస్తూ నాని రెండవ స్థానం సాధించడం విశేషం. యుఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న చిత్రాల్లో నానికి ఇది 8 వ చిత్రం. 11 చిత్రాలతో మహేష్ బాబు అగ్ర స్థానంలో ఉన్నారు.
66
మొన్నటి వరకు ఎన్టీఆర్, నాని ఏడు 1 మిలియన్ చిత్రాలతో సమానంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నాని దసరాతో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. మూడవ స్థానములో ఆరు చిత్రాలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రాంచరణ్ ఉన్నారు.