Krishna Mukunda murari: అయోమయంలో ముకుంద.. తొందర్లో భార్యకు మాటిచ్చిన మురారి!

Published : Apr 01, 2023, 01:31 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి మంచి రేటింగ్ ని సంపాదిస్తూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. కుటుంబ గౌరవం కోసం కూతురి ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.    

PREV
18
Krishna Mukunda murari: అయోమయంలో ముకుంద.. తొందర్లో భార్యకు మాటిచ్చిన మురారి!

 ఎపిసోడ్ ప్రారంభంలో మురారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ మీద కేకలు వేస్తూ ఉంటాడు.ఇంకా అక్కడ కృష్ణ ఉన్నట్టు భ్రమలో ఉంటాడు మురారి. ఎందుకు సార్ అంత కోపం కొంచెం నవ్వుతూ ఉండండి అని అంటుంది కృష్ణ అప్పుడు మురారి నవ్వుతాడు సడన్ గా మురారి మొఖంలో మార్పులు చూసి కానిస్టేబుళ్లు ఆశ్చర్యపోతారు ఇంతలో కమిషనర్ అక్కడికి వస్తాడు. ఎప్పుడు వచ్చారు సార్ అని అనగా నువ్వు ఈ మధ్య పోలీస్ స్టేషన్లో పరధ్యానంగా  ఉంటున్నావు అని కంప్లైంట్ వచ్చింది ఇక్కడికి వచ్చి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఏమైంది చెప్పు కొత్తగా పెళ్లయింది కదా భార్యకి భయపడుతున్నావా మనం మగవాళ్ళం అలా భయపడకూడదు అని అంటాడు. ఇంతలో కమిషనర్ కి తన భార్య ఫోన్ చేసి ఇంటికి త్వరగా రాలేదు అని తిడుతుంది.
 

28

ఫోన్ పెట్టేసిన తర్వాత మనం మగపులులం ఎవరికీ భయపడము ఒక్క ఆడపిల్లకి తప్ప అని చెప్పి ఇప్పుడు చెప్పు ఏమైంది అని అనగా నేను ప్రేమలో పడ్డాను సర్ నా భార్యతో ప్రేమలో పడ్డాను అందుకే ఈమధ్య ఇలా  ఉంటున్నాను. మీరేం అనుకోకపోతే నాకు ఒక రోజు లీవ్ ఇస్తారా అని అడుగుతాడు మురారి. ఒకరోజేమీ రెండు రోజులు తీసుకో తర్వాత వచ్చి శ్రద్ధగా పనిచేయు అని అంటాడు కమిషనర్. మరోవైపు ఈమధ్య నందిని, కృష్ణ మాటలు వినడం మొదలు పెడుతుంది అసలు కృష్ణ, నందినితో చనువుగా ఉంటే భయం వేస్తుంది అలాగని కృష్ణను ఏమైనా అంటే మురారి ఒప్పుకోవడం లేదు చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాడు మనం ఇప్పుడు కృష్ణని బయటకు పంపించలేము కనుక నందినిని అమెరికాలో ఉన్న మా చెల్లెలు ఇంటికి పంపించాలి అంటుంది భవాని.

38

అదే సరైన పని అని పక్కన ఉన్న ఈశ్వర్  అంటాడు వెనుక నుంచి ఇదంతా చూస్తున్న ముకుంద, కృష్ణ, నందినికి మంచి చేయాలనే కదా చూస్తుంది మరి పెద్దత్తయ్య ఎందుకు అంత భయపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది కన్న కూతుర్ని అమెరికా పంపించేయడం ఎందుకు అది కూడా కృష్ణకు భయపడి అయినా నందిని అమెరికా అయితే కృష్ణకి ఇంట్లో విలువ ఉండదు. అప్పుడు నేనే ఇంట్లో రాజ్యాన్ని ఏలొచ్చు అని అనుకుంటుంది ముకుంద. మరోవైపు గౌతమ్ హాస్పిటల్ లో ఉండగా కృష్ణ అక్కడికి వస్తుంది దారిలో ఎవరు వెనుక పడలేదు కదా అని అనగా అలా కూడా చేస్తారా సార్ అని అడుగుతుంది కృష్ణ పరువు హత్యలు గురించి వినలేదా నేను అజ్ఞాతంలోకి వెళ్లకపోయి ఉంటే ఈ పాటికి నన్ను చంపేసే వాళ్ళు ఇంతకీ నందిని ఎలా ఉన్నది అని అడుగుతాడు గౌతమ్.

48

మీ గురించే అడుగుతుంది సార్ సిద్దు, సిద్దు అని హాస్పిటల్ కి కూడా వస్తాను అంటుంది అని అంటుంది కృష్ణ మతిస్థిమితం లేకపోయినా నన్ను గుర్తుంచుకున్నది అంటే నా మీద ప్రేమ ఇంకా చావలేదు నువ్వే ఏదో ఒకటి చేసి మా ఇద్దరికీ పెళ్లి చేయాలి కృష్ణమ్మ అని అంటాడు గౌతమ్. చేస్తాను సార్ నేను అదే పనిలో ఉన్నాను ఎలాగైనా మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అని అంటుంది కృష్ణ.ఆ తర్వాత సీన్లో మురారి ఇంటికి వస్తే ముకుంద ఆపి ఇంత త్వరగా ఎందుకు వచ్చావు కృష్ణకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నావా లేక తనే క్షమాపణలు చెప్తుంది అనుకుంటున్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అన్నిటికీ ఏమీ లేదు అని సమాధానం ఇస్తాడు మురారి. ఏమీ లేదు అంటావేంటి ఏదో ఉన్నది అని ముకుంద అనగా అవును ఉన్నది అయితే ఏంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు  మురారి.

58

ఏముంది అని అనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత సీన్లో నందిని, కృష్ణ ఏది అని అరుస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ వస్తుంది నేను నీతో మాట్లాడను అని చెప్పడానికే వచ్చాను నువ్వు నన్ను సిద్దు ని చూపిస్తానన్నావు నేను హాస్పిటల్లో సిద్ధుని చూశాను అని అనగా ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ ఉలుక్కిపడతారు. ఆ మాటలకి షాక్ అవుతుంది కృష్ణ . మా హాస్పిటల్లో సిద్ధూ అని ఎవరూ లేరమ్మా అని చెప్పి నీకు ఈ రోజు నేను చీర కట్టడం నేర్పిస్తాను నా దగ్గరికి వస్తావా అని కృష్ణ, నందిని అడుగుతుంది. సరే వస్తాను అని అంటుంది నందిని.చీర కడతాను అనేసరికి ఇంట్లో వాళ్లు ముఖాన్ని అఇష్టంగా పెడతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చీర కడతాను అనేసరికి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని మనసులో అనుకుంటుంది ముకుంద.

68

మరోవైపు  మురారి గదిలో తలగడ తీసుకోడానికని వచ్చిన కృష్ణ అక్కడినుంచి వెళ్తుండగా మురారి ఆపి ఎందుకు ఈ భార్యలు ఎప్పుడూ భర్త మనసును అర్థం చేసుకోరు ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుకి ఇప్పటికొచ్చి క్షమించరా అని అనగా మా భార్యలు వ్యక్తిత్వాన్ని ఏమైనా అంటే మేము జీవితాంతం గుర్తుతెచ్చుకొని బాధపడతాము మర్చిపోలేము అని అంటుంది.మీ భార్యలు మనసులు బాధపెట్టాలని మేము ఎప్పుడూ అనుకోం కదా ఏదో ఒక మాట అన్నా తప్పేనా అని అనగా ఆగండి మనమెందుకు అసలైన భార్యాభర్తల్లాగా మాట్లాడుకుంటున్నాము అంతా కొంతకాలమే కదా కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయే దాన్ని నేను చేయాల్సిన పని చేసుకుని వెళ్లిపోతాను తర్వాత ఒంటరి దాన్నే కదా అని అంటుంది కృష్ణ.

78

నువ్వు అలా అనద్దు కృష్ణ, నువ్వు అలా అన్న దగ్గరనుంచి  నా ధ్యాస అస్సలు పనిమీద లేదు అక్కడ కూడా పరధ్యానంలోనే ఉంటున్నాను ఈరోజు కమిషనర్ గారు వచ్చి ఎందుకిలా ఉంటున్నావు అని అడిగారు రెండు రోజులు సెలవు కూడా ఇచ్చారు అని అనగా మీరు ఇక్కడ ఉండడం కన్నా ఆఫీస్కు వెళ్తేనే మంచిది సార్ నేను ఉదయం వెళ్లి రాత్రి వస్తాను రాత్రి వచ్చిన సరే నందిని గదిలోనే పడుకుంటాను అని అంటుంది కృష్ణ. నన్ను ఇంకా క్షమించవా కృష్ణ అని అనగా నాది అంతా విశాలమైన మనసు కాదు సార్ అయినా కొన్ని రోజులే ఉంటాను కదా ఎందుకు నిజమైన భార్య భర్తల్లాగా మాట్లాడుకుంటున్నాము?  నా కళ్ళముందే మా నాన్నని మీరు చంపారు అని తెలిసినా సరే ఏమీ చేయలేని పరిస్థితి. మా నాన్న మాట ప్రకారం ఇష్టం లేకపోయినా తాళి కట్టించుకున్నాను ఎంతైనా కొన్ని రోజులే కదా ఇక్కడ ఉండేది అంటుంది కృష్ణ.

88

మరి ఏం చేస్తే నన్ను క్షమిస్తావు కృష్ణ అని మురారి అడగగా ఏం చేసినా క్షమించను అని కృష్ణ అంటుంది.తరువాయి భాగంలో భవాని, నందిని అమెరికా వెళ్లే లోపు కృష్ణ ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద ప్రమాదం అవుతుంది అని అంటుంది నందిని ఆరోగ్యం విషయం కృష్ణకే వదిలేద్దాము అని రేవతి అనగా రేవతి భర్త వచ్చి రేవతి అని గట్టిగా అరుస్తాడు.మరోవైపు నేను మిమ్మల్ని క్షమించాలి అంటే ఇద్దరు మేజర్లకు పెళ్లి చేయాలి ఏసీపి సర్ అని అంటుంది కృష్ణ. తప్పకుండా చేస్తాను అని కృష్ణకు మాటిస్తాడు మురారి. కృష్ణ ఆనంద పడుతుంది

click me!

Recommended Stories