నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై నవీన్‌ విజయ్‌ కృష్ణ రియాక్షన్‌ ఇదే.. వామ్మో తండ్రిని మించిన కొడుకు

Published : Mar 19, 2024, 05:53 PM ISTUpdated : Mar 19, 2024, 06:06 PM IST

సీనియర్‌ నటుడు నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై ఆయన కొడుకు నటుడు, దర్శకుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ క్రేజీగా స్పందించాడు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.   

PREV
16
నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై నవీన్‌ విజయ్‌ కృష్ణ రియాక్షన్‌ ఇదే.. వామ్మో తండ్రిని మించిన కొడుకు

నరేష్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో నవ మన్మథుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. వరుస పెళ్లిళ్లతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయాడు. ఇప్పుడు నటి పవిత్ర లోకేష్‌తో నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం గతేడాది బాగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. తన మూడో భార్య ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో అది మరింత పెద్ద వివాదంగా మారింది. 

Polling: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

26

ఈ వివాదాలన్నీ సర్దుమనిగి సైలెంట్‌గా పవిత్రతో కలిసి ఉంటున్నాడు నరేష్‌. ఆమెకి అధికారికంగా విడాకులు వస్తే, నరేష్‌కి అధికారికంగా మూడో భార్య నుంచి విడాకులు వస్తే ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే నరేష్‌ పెళ్లిళ్లపై చాలా వరకు విమర్శలే వస్తుంటాయి. దారుణమైన ట్రోల్స్ జరుగుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు నరేష్‌. 
 

36

తాజాగా నరేష్‌ కొడుకు నవీన్‌ విజయ్‌ కృష్ణ(మొదటి భార్య కొడుకు) స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై ఆయన క్రేజీగా రియాక్ట్ అయ్యాడు. సింపుల్‌గా అది ఆయన(తండ్రి నరేష్‌) వ్యక్తిగత నిర్ణయమని, అందులో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదన్నారు. ఆయన ఎక్కడ సంతోషం ఉందో అక్కడ వెళ్తున్నాడని, తన సంతోషాన్ని తాను వెతుక్కుంటున్నట్టు తెలిపాడు. పెళ్లిళ్ల విషయం తనకు కూడా చెప్పాడని, కానీ నాకెందుకు చెబుతున్నావని, నీకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయమని చెబుతుంటానని తెలిపాడు నవీన్‌. నానమ్మ విజయ్‌ నిర్మల కూడా అదే చెప్పేవారన్నాడు నవీన్‌. 
 

46

`లైఫ్‌లో ఎవరి స్క్రీన్‌ ప్లే వాళ్లదని, వాళ్లే డిజైన్‌ చేసుకోవాలి. నాన్నకంటే బయట చాలా మంది చాలా పెళ్లిళ్లు చేసుకుంటారు. వాళ్లవి ఇంకా వివాదంగా ఉంటాయి. కానీ అవి బయటకు తెలియవు, నాన్న పబ్లిక్‌ ఫిగర్‌ కావడంతో బయటకు వస్తుంటాయి, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. నాన్న పెళ్లిళ్ల ద్వారా సమాజానికి ఏం చెబుతున్నారనే వాదన వినిపిస్తుంది. కానీ ఆయన్నుంచి నేను తీసుకున్న సందేశం ఏంటంటే.. జీవితంలో రాజీ పడకుడదు. నీ సంతోషం నీకు కావాలంటే ముందుకు వెళ్లిపో, వద్దంటే అక్కడే ఆగిపో అనేది తీసుకున్నా` అని చెప్పారు.

56
pavitra lokesh and naresh

ఇక తనకు కూడా అలాంటి ఆఫరే ఇచ్చాడట నరేష్‌. నీ లైఫ్‌ పార్టనర్‌ని కూడా నువ్వే చూసుకో అని చెప్పారట. నువ్వు చూసుకుని చెబితే మేం పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి పోతామని చెప్పారట. నానమ్మ విజయ నిర్మల కూడా అలాంటి మైండ్‌సెట్‌తోనే ఉండేదని, అదే విషయం చెప్పేదన్నారు నవీన్‌. గ్రాండ్‌ వెడ్డింగ్ తనకు నచ్చదని, కోట్లు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటారు, కానీ మ్యారేజ్‌ అయిన కొన్ని రోజులకే విడిపోతారు, వాటికేం అంటారని ప్రశ్నించారు నవీన్‌. 
 

66

నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా రెండు సినిమాలు చేశాడు. ఒకటి విడుదల కాలేదు, ఒకటి విడుదలై మెప్పించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే తనకు మాత్రం దర్శకత్వం అంటే ఇష్టమని, నానమ్మకోరిక మేరకు నటించినట్టు తెలిపాడు. దర్శకుడిగానే కొనసాగుతానని తెలిపాడు నవీన్‌. తనకు ఎడిటింగ్‌లోనూ మంచి పట్టుంది. ఇటీవల సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో `సత్య` అనే షార్ట్ ఫిల్మ్ లో రూపొందించాడు. త్వరలోనే దీన్ని విడుదల చేయబోతున్నారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories