ఓ ఐదేళ్ల క్రితం ఇంటర్వ్యూలో భర్త సుచేంద్ర తో ప్రేమ, పెళ్లి ఎలా జరిగాయో వివరించారు. మేమిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం కలిగింది. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాతో పోల్చుకుంటే చేసుకుంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేం. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు, అని పవిత్ర తెలిపారు.