సమంతకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. బడా హీరో సరసన నటించే ఛాన్స్.?

Published : Jun 23, 2022, 06:00 PM ISTUpdated : Jun 23, 2022, 06:01 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోయిన్. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ బంపర్ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది.

PREV
16
సమంతకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. బడా హీరో సరసన నటించే ఛాన్స్.?

ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది సమంత. చైతూతో డివోర్స్ తీసుకున్నాక లైఫ్ ను రీఫ్రెష్ గా స్టార్ట్ చేసింది. కేరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడా టైం వేస్ట్ కాకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, మిగితా సమయంలో ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తోంది. 
 

26

తను నటిస్తున్న చిత్రాలను సమంత శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎక్కడా జాప్యం లేకుండా రెగ్యూలర్ గా షూటింగ్ లకు హాజరవుతోంది. చివరిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిన సమంత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఊపూపింది.  

36

వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’తో ప్రేక్షకులను అలరించింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇదిలా ఉంటే సమంత నటిస్తున్న అసలైన చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 

46

సమంత కేరీర్ లోనే రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాలు‘యశోద’, ‘శాకుంతలం’. ఇప్పటికే ఈ చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. అభిమానులు కూడా ఈ చిత్రాలకోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

56

మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో పనిచేస్తూ ఆసక్తి పెంచుతోంది. తాజాగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం..  సమంతకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది.

66

బాలీవుడ్ రొమాంటిక్ హీరో సల్మాన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో సల్మాన్ నటించిన ‘నో ఎంట్రీ’ సీక్వెల్ లో సమంతను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇదే చిత్రంలో రష్మిక మందన్న, పూజా హెగ్దే, తమన్నా కూడా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories