బిగ్ బాస్ తెలుగు 9లోకి లక్స్ పాప ఎంట్రీ.. అతడిని ప్రేమించి ఎంత టార్చర్ అనుభవించిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Published : Sep 07, 2025, 08:19 PM IST

సిల్వర్ స్క్రీన్ పై తన గ్లామర్ తో మాయ చేసిన ఫ్లోరా షైనీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా హంగామా చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది.బిగ్ బాస్ సీజన్ 9 వేదికపైకి రాగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వివరించింది.

PREV
13
ఫ్లోరా షైనీ ఎంట్రీ

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభం అయింది. ముందు నుంచి సీజన్ 9 కి ఒక రేంజ్ లో హైప్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే హౌస్ లో చాలా మార్పులు చేశారు. ఈసారి రెండు హౌస్ లో ఉండబోతున్నాయి. సెలెబ్రిటీలతో పాటు ఐదుగురు సామాన్యులు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెకండ్ కంటెస్టెంట్ గా నరసింహ నాయుడు లక్స్ పాప ఆశా షైనీ( ఫ్లోరా షైనీ) ఎంట్రీ ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై తన గ్లామర్ తో మాయ చేసిన ఫ్లోరా షైనీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా హంగామా చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది. 

23
కెరీర్ స్ట్రగుల్స్, తొలి అవకాశం గురించి.. 

బిగ్ బాస్ సీజన్ 9 వేదికపైకి రాగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వివరించింది. నాగార్జున ఆమెని ఆశా సైనీ అని పిలిచారు. అలా వద్దు సార్.. నన్ను ఫ్లోరా షైనీ అని పిలవండి. ఎందుకంటే అది నా ఒరిజినల్ నేమ్ అని తెలిపింది. బిగ్ బాస్ 9 వేదికపై ఫ్లోరా షైనీ ఎవి ప్రదర్శించారు. ఈ ఎవిలో ఫ్లోరా షైనీ తన కెరీర్, లైఫ్ సృగుల్స్ గురించి తెలిపింది. నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాల్లో నటించాను. కాలేజ్ తర్వాత మోడలింగ్ లో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నాను. ఓవర్ వైట్ కారణంగా నన్ను ఎలిమినేటి చేశారు. ఆ తర్వాత పట్టుదలతో బరువు తగ్గి నాజూగ్గా మారి మరోసారి బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొని విన్నర్ గా నిలిచా. ఆ టైం ఈవీవీ సత్యనారాయణ గారు చాలా బావుంది మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ ఇలా తెలుగు తమిళ భాషల్లో 50 వరకు సినిమాలు చేశాను. 

33
అందరిలా ప్రేమలో పడి నరకం అనుభవించిన ఫ్లోరా షైనీ 

తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ అందరిలాగే తాను కూడా ప్రేమలో పడ్డానని ఫ్లోరా షైనీ పేర్కొంది. కానీ ఆ ప్రేమ తనకి కన్నీళ్ళని మాత్రమే మిగిలినట్లు ఫ్లోరా షైనీ భావోద్వేగానికి గురైంది. ప్రేమించిన వ్యక్తి నన్ను ఫిజికల్ గా టార్చర్ చేశారు. మానసికంగా వేధిస్తూ, నా వ్యక్తిత్వంపై మచ్చ వేశాడు. ఆ ప్రేమ వల్ల ఎంతో వేదన అనుభవించా. ఫిజికల్ గా అటాక్ కి కూడా గురయ్యా అని ఫ్లోరా షైనీ పేర్కొంది. ఆ టైంలో తన తల్లి దండ్రులు తప్ప ఇంకెవరూ మద్దతు ఇవ్వలేదని ఫ్లోరా షైనీ పేర్కొంది. ఆ సంఘటన వాళ్ళ నిజమైన ప్రేమ పై నమ్మకం పోయింది అని ఫ్లోరా పేర్కొంది. ఇంకా జీవితం ఉంది కాబట్టి నిజమైన ప్రేమ దొరుకుతుందేమో చూడాలి అని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లోరా షైనీ వయసు 46 ఏళ్ళు. 

Read more Photos on
click me!

Recommended Stories