ఆర్మీ నుంచి బిగ్ బాస్ వరకు.. ఫస్ట్ కామనర్ గా సోల్జర్ పవన్ కల్యాణ్

Published : Sep 07, 2025, 08:18 PM IST

Bigg Boss Telugu Season 9 : బిగ్ బాస్ హౌస్‌‌లో ఫస్ట్ కామనర్‌గా సోల్జర్ పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఆయన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  

PREV
13
డబుల్ హౌస్ – డబుల్ డోస్

Bigg Boss Telugu Season 9 : కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌ను కొత్త కాన్సెప్ట్‌తో రెడీ చేశారు. "డబుల్ హౌస్ – డబుల్ డోస్" థీమ్ తో షో హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఆడియన్స్‌లో కుతూహలం మరింత పెరిగింది. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్‌కి కూడా అవకాశం ఇవ్వడం షోలో కొత్త హైలైట్‌గా మారింది. మూడో కంటెస్టెంట్‌గా ఫస్ట్ కామనర్ ఎవరు వచ్చారో తెలుసా?

23
ఆర్మీ నుంచి బిగ్ బాస్ వరకు

బిగ్ బాస్ హౌస్‌‌లో ఫస్ట్ కామనర్‌గా సోల్జర్ పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆయన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గత మూడేండ్లుగా ఇండియన్ ఆర్మీలో సోల్జర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ లీవ్ పై వచ్చి, బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. తన సింపుల్ లైఫ్‌స్టైల్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌తో ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫ్యాన్ బేస్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.

33
కామనర్స్‌కి హోప్

ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే కనిపించారు. కానీ ఈసారి పవన్ కల్యాణ్ వంటి సామాన్యులు కూడా అవకాశం దక్కించుకోవడం ఆడియన్స్‌లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఆయన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, ఇతర కంటెస్టెంట్స్‌తో ఎలా మెలుగుతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories