నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. త్వరలో శిరీషతో నారా రోహిత్ వివాహం జరగనుంది. తాజాగా జరిగిన పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి.
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆయనకు నటి శిరీష (Siree Lella)తో వివాహం జరగనుంది. ఇటీవల ఈ జంట వివాహ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. శిరీష కుటుంబ సభ్యుల సమక్షంలో పసుపు దంచిన వేడుక ఘనంగా జరిగింది.
25
ఫోటోలు షేర్ చేసిన శిరీష
ఈ వేడుకకు శిరీష సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. శిరీష స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పసుపు దంచిన ఫోటోలను పంచుకున్నారు. చీరలో సాంప్రదాయ వేషధారణలో మెరిసిన శిరీష ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
35
గతేడాది ఎంగేజ్మెంట్
నారా రోహిత్, శిరీష ప్రేమలో ఉన్నారనే వార్తలు గతేడాది నుంచి టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎంగేజ్మెంట్ గతేడాది అక్టోబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఆ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెద్దలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ జంట అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ నెలలో వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. పెళ్లి తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. నారా రోహిత్ టాలీవుడ్‌లో తన విభిన్నమైన కథా ఎంపికలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు. మరోవైపు శిరీష, ‘ప్రతినిధి 2’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందింది.
55
నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ
ఈ జంట పెళ్లి వార్త టాలీవుడ్ అభిమానుల్లో ఆనందం నింపింది. నారా కుటుంబం, శిరీష కుటుంబం కలిసి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. పసుపు వేడుకతో వివాహ సంబరాలు అధికారికంగా మొదలయ్యాయి.నారా రోహిత్ చివరగా సుందరకాండ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. తాను త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా నారా రోహిత్ ఇటీవల తెలిపారు.