గ్రాండ్ గా నారా రోహిత్ నిశ్చితార్థం..పెళ్లి గురించి అప్పుడే హింట్ ఇచ్చిన హీరోయిన్, అతడిపై ఇష్టాన్ని ఇలా

First Published | Oct 13, 2024, 4:03 PM IST

అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నారా రోహిత్ నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు, అదే విధంగా హీరోయిన్  సిరి లెల్లా కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరయ్యారు. 

అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నారా రోహిత్ నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు, అదే విధంగా హీరోయిన్  సిరి లెల్లా కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరయ్యారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకే నారా రోహిత్. చాలా కాలంగా సినిమాల్లో ఉంటున్నాడు రోహిత్. ఇటీవల గ్యాప్ తీసుకుని ప్రతినిధి 2 చిత్రం చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. 

హైదరాబాద్ లో ఆదివారం రోజు నరాల రోహిత్,  సిరి లెల్లా నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా నారా రోహిత్,  సిరి లెల్లా ప్రతినిథి 2 చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ మ్యారేజ్ సెట్ కావడంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక పాత్ర వహించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నిశ్చితార్థ వేడుకలో ఆమె బాగా సందడి చేశారు. 

Also Read : బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ మధ్య జరిగిన వివాదం..చరిత్రలో మరచిపోలేరు, కాంప్రమైజ్ కాకుండా చాలా దూరం వెళ్లారు


అయితే  సిరి లెల్లా ఎవరు.. నారా రోహిత్ తో ఎలా ప్రేమలో పడింది అనే వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతినిథి 2 చిత్ర సమయంలోనే నారా రోహిత్ పై ఆమె తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ హింట్ ఇచ్చినట్లు కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.  సిరి లెల్లా ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించి వచ్చిన అమ్మాయి. తన బ్యాగ్రౌండ్ గురించి ప్రతినిథి 2 చిత్ర సమయంలో సిరి లీలా కొన్ని విషయాలు తెలిపింది. 

Also Read: పెళ్ళికి పిలవడానికి చిరంజీవి ఇంటికి వెళ్లి..స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి, అసలేం జరిగిందంటే

సిరి లెల్లా మాట్లాడుతూ.. ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలంటే ఇంట్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలిసిందే. నేను బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే సినిమాల్లోకి రావాలని అనుకున్నా. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. మాస్టర్స్ పూర్తి చేయాలి అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు చెప్పినట్లుగానే మాస్టర్స్ ఆస్ట్రేలియాలో పూర్తి చేశా. ఇక సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తా అని చెప్పా. లేదు పెళ్లి చేస్తాం అని అన్నారు. నేను ఇంట్లో వాళ్ళ మాట వినలేదు. నాకు కనీసం 2 ఏళ్ళు సమయం కావాలి. సినిమాల్లో ట్రై చేస్తా. సక్సెస్ కాకపోతే మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా అని చెప్పా. 

ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభిచా. లక్కీగా ప్రతినిథి 2లో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి.. నా రియల్ నేమ్ కూడా సిరినే. కాబట్టి బాగా కనెక్ట్ అయ్యా. నారా రోహిత్ పై ఇష్టాన్ని కూడా సిరి అదే సమయంలో బయట పెడుతూ హింట్స్ ఇచ్చింది అని నెటిజన్లు అంటున్నారు. నారా రోహిత్ ని మీడియా సమావేశంలో రోహిత్ సార్ అంటూ సంభోదించింది. నా ఫస్ట్ కోస్టార్ రోహిత్ సార్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన చిత్రాలు అంటే ఇష్టం. ఎప్పుడెప్పుడు ఆయనతో కలసి నటిస్తానా అని ఎదురుచూసినట్లు  సిరి లెల్లా మీడియా సమావేశంలో తెలిపింది. ఇప్పుడు ఆమె నారా రోహిత్ తో కలసి నటించడం మాత్రమే కాదు.. కలసి ఏడడుగులు వేయబోతోంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిన సందర్భంగా నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

Latest Videos

click me!