నాగార్జున, శ్రియా కలిసి `సంతోషం`, `బాస్`, `నేనున్నాను`, `మనం` సినిమాలు చేశారు. ఇందులో `బాస్` సినిమా పెద్దగా ఆడలేదు. మిగిలిన మూవీ సినిమాలు బాగా ఆడాయి. `మనం` క్లాసికల్‌గా నిలిచింది. ఇప్పుడు శ్రియా సినిమాలు తగ్గించింది. అంటే ఆమెకి అవకాశలు పెద్దగా రావడం లేదు. గతేడాది `మ్యూజిక్ స్కూల్` సినిమాలో మెరిసింది.
దీంతోపాటు హిందీలో `షో టైమ్` అనే టీవీ సిరీస్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆమె సూర్యతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక నాగార్జున మల్టీస్టారర్లతో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్‌తో `కూలీ`, ధనుష్‌తో `కుబేర` సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు 8కి హోస్ట్ గా చేస్తున్నాడు.