భార్య నుదిట బొట్టు పెట్టి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన నాని.. నేచురల్ స్టార్ లవ్ స్టోరీ తెలుసా?

First Published | Oct 27, 2023, 6:06 PM IST

నేచురల్ స్టార్ నానికి ఈరోజు చాలా ప్రత్యేకం. నేటితో ఆయన వివాహా బంధంలో 11 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తన భార్య కు బ్యూటీఫుల్ ఫొటోతో విషెస్ తెలిపారు. ఈక్రమంలో నాని పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

నేచురల్ స్టార్ నాని (Nani) వరుస చిత్రాలతో కెరీర్ పై ఎంత శ్రద్ధ వహిస్తున్నారో తెలిసిందే. ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ క్వాలిటీ టైమ్ గడుపుతుంటారు నాని. కుటుంబంతో సరదా ఉండే ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూనే ఉంటుంటారు. 

ఈరోజు నానికి చాలా స్పెషల్ డే. నేచురల్ స్టార్ పెళ్లి రోజే ఇవ్వాళే కావడం విశేషం. నేటితో ఆయన వివాహా బంధంలో 11 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తన భార్య అంజన యేలవర్తికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా భార్య నుదిట కుంకుమ పెట్టే బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం నాని పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 


నాని - అంజన పెళ్లి 2012లో  గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత ఐదేళ్లకు కొడుకుకు జన్మనిచ్చి తల్లిదండ్రలుగా మారారు. కొడుకుపై నాని ఎంత ప్రేమ చూపిస్తారో తెలిసిందే. ఇక నాని పెళ్లి రోజు సందర్భంగా అభిమానులు ఆయనకి విషెస్ తెలుపుతున్నారు. 

ఇక నాని పెళ్లి రోజు సందర్బంగా ఆయన లవ్ స్టోరీ మేటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. నాని వైజాగ్ లో RJగా వర్క్ చేస్తున్న సమయంలో అంజన యేలవర్తిని మొదటి సారి కలిశారు. ఆ పరిచయంతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఐదేళ్లపాటు రిలేషన్ షిప్ కొనసాగించి పెళ్లి పీటలు ఎక్కారు. 
 

నాని లైఫ్ లోకి అంజనా వచ్చిన తర్వాత కెరీర్ లో మరింత ముందుకు వెళ్లారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసిన ఆమె ప్రస్తుతం హౌజ్ వైఫ్ గానే ఉంటారు. చిన్నచిన్న బిజినెస్ లూ రన్ చేస్తున్నట్టు టాక్. 2012 ఆగస్టు 12న వీరి నిశ్చితార్థం జరగగా.. 2012 అక్టోబర్ 27న కుటుంబ సమక్షంలో వివాహం జరిగింది.
 

ప్రస్తుతం నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. విభిన్న కథలతో ఆకట్టుకుంటున్నారు. చివరిగా ‘దసరా’తో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ‘హాయ్’ నాన్న చిత్రంతో రాబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2023 డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. మరోవైపు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’(Nani31)  చిత్రాన్ని కూడా ప్రారంభించారు. 
 

Latest Videos

click me!