గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సినిమాల జోరు పెద్దగా లేదు. తనకు వచ్చిన ఆఫర్లను మాత్రం వినియోగించుకుంటోంది. గతేడాది తమిళం, మలయాళంలో వరుస చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా అప్డేట్స్ ఏమీ లేవు.
నార్త్ కు చెందిన పూనమ్ బజ్వా తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించింది. హీరోయిన్ గా తన కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభం అవ్వడం విశేషం. ‘మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘వేడుక’; ‘పరుగు’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లోనూ మెరిసింది.
ఆ తర్వాత మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ‘బాస్’ మూవీతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు సినిమాల్లో ఎప్పుడూ కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికైతే అలాంటి అప్డేట్స్ ఏమీ లేవు.
ఇదిలా ఉంటే.. పూనమ్ బజ్వా నెట్టింట మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తుంటుంది. అలాగే మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతుంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంది.
బాల్కానీలో బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాల దర్శనం చేసింది. బిగుతైన మినీ డ్రెస్ లో పూనమ్ బజ్వా థైస్ షోతో మతులు పోగొట్టింది. కిక్కిచ్చే పరువాల ప్రదర్శనతో.. హార్ట్ బీట్ పెంచేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కవ్వింపు చర్యలతో కుర్ర హృదయాలను కలవరపెట్టింది. లేటెస్ట్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మ కాస్తా జాగ్రత్తలు తీసుకుంటుంది. చూడటానికి బొద్దుగా కనిపించినా.. ప్రతి రోజూ యోగా చేస్తుంటుంది. హెల్త్ విషయంలో పాటించాల్సిన నియమాల్ని పాటిస్తుంది. ఈ మేరకు అప్పుడప్పుడు కొన్ని స్ఫూర్తినిచ్చేలా పోస్టులు కూడా పెడుతుంటుంది. ఏదోలా ఎప్పుడూ నెట్టింట దర్శనమిస్తూనే ఉంటుంది.