ఇక నాని వాసు, శ్యామ్ పాత్రల్లో ప్రదర్శించిన వేరియేషన్స్ సూపర్బ్ అనే చెప్పాలి. తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా నాని నటించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరి రోల్స్ చాలా బావున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ప్రేక్షకులని అరెస్ట్ చేసే విధంగా ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ క్రిస్టమస్ కి నాని సాలిడ్ మూవీతో వచ్చాడు.