కూతురితో కలిసి ఫస్ట్ టైమ్‌ సొంతింటికొచ్చిన ప్రియాంక చోప్రా దంపతులు.. ఎయిర్‌పోర్ట్ లో సందడి..

First Published Mar 31, 2023, 3:49 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఇండియాని వదిలేసి చాలా రోజులే అవుతుంది. ఇప్పుడు ఆమె అమెరికాలోనే సెటిల్‌ అయ్యింది. కానీ చాలా రోజుల తర్వాత ఆమె సొంతింటికి వచ్చింది. 
 

ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయిన విషయం తెలిసిందే. వీరికి కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ అనే కూతురు కూడా జన్మించింది. చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చారు ప్రియాంక దంపతులు. ముంబయిలోని ఎయిర్‌పోర్ట్ వద్ద సందడి చేశారు. 
 

ప్రియాంక చోప్రా, తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ఆమె ఎయిర్ పోర్ట్ బయట కెమెరాకి చిక్కారు. ఇందులో తన కూతురు మాల్టీ మేరీతో కలిసి వాళ్లు సందడి చేయడం విశేషం. ఈ సందర్భంగా కెమెరాలకు తన కూతురుని చూపిస్తూ మురిసిపోతున్నారు ప్రియాంక చోప్రా దంపతులు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇందులో ప్రియాంక చోప్రా పింక్‌ కలర్‌ ట్రెండీ వేర్‌ ధరించింది. మరోవైపు థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఇందులో తన భర్త నిక్‌ జోనాస్‌ బ్లూ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నారు. మరోవైపు కూతురికి స్కై బ్లూ ఫ్రాక్‌ వేశారు. కూతురు మల్తీ ఎంతో క్యూట్‌గా ఆకట్టుకుంటుంది. 
 

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫ్యామిలీ ఎయిర్‌ పోర్ట్ ముందు దిగిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత ప్రియాంక ఇండియాకి వచ్చింది. తన సొంతింటి(ముంబయి)కి రావడం విశేషం. ముంబయిలో ప్రియాంక చోప్రాకి సొంతిళ్లు, ఆస్తులు, బంగ్లాలు ఉన్న విషయం తెలిసిందే. 
 

ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ స్టార్‌గా రాణిస్తున్న విసయం తెలిసిందే. ఆమె ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాలే చేస్తుంది. బాలీవుడ్‌(ఇండియా) మూవీస్‌ మానేశారు. ప్రస్తుతం ప్రియాంక `లవ్‌ ఎగైన్‌` చిత్రంలో నటిస్తుంది. రెండేళ్ల తర్వాత ఆమె చేస్తున్న మూవీ ఇది. అంతకు ముందు `ది మ్యాట్రిక్స్ సెరురెక్షన్స్` చిత్రంలో నటించింది. అలాగే `ది వైట్‌ టైగర్‌` అనే హిందీ- ఇంగ్లీష్‌ మూవీలో మెరిసింది. ఇదే ఆమె నటించిన చివరి బాలీవుడ్‌ మూవీగా చెప్పొచ్చు. 
 

ప్రియాంక చోప్రా మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చింది. మోడల్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి, అట్నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ముందు గ్లామర్‌ షో చేసింది. కమర్షియల్‌ చిత్రాలతో మెప్పించింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అట్నుంచి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి నెక్ట్స్ లెవల్‌కి ఎదిగింది. 
 

ఎయిర్‌ పోర్ట్ లో కారు ఎక్కుతూ ఫోటోగ్రాఫర్లకి అభివాదం చేస్తున్న ప్రియాంక చోప్రా. స్టయిలీస్‌ గ్లాసెస్‌, పింక్‌ డ్రెస్‌లో థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తుందీ గ్లోబల్‌ బ్యూటీ. 

click me!