
నాని(Nani) ప్రస్తుతం `అంటే సుందరానికి`(Ante Sundaraniki) చిత్రంలో నటించారు. నజ్రియా నజీమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో సోమవారం ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కి సంబంధించి కాంఫ్లిక్ట్స్ ఉంటుందని, అది ఫన్నీగా ఉంటుందన్నారు. దాని చుట్టే తిరిగే అంశాలు నవ్వులు పూయిస్తాయని, అయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కి సంబంధించి రెండు మెయిన్ ప్లాట్స్ లు ఉంటాయని, ఒకటి మాత్రమే రివీల్ చేశామని, రెండోది బయటకు చెప్పలేనిదని, అది సినిమా చూస్తేనే అర్థమవుతుందని తెలిపారు నాని.
నాని కూడా రియల్ లైఫ్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో మాదిరి తన రియల్ లైఫ్‌లో అమ్మాయి పేరెంట్స్ ని ఒప్పించేందుకు ఇబ్బంది పడ్డారా? అన్న `ఏషియానెట్` ప్రతినిధి ప్రశ్నకి నాని స్పందిస్తూ, తమది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదన్నారు. అయితే తన లవ్ స్టోరీలో ఇలాంటి ఇబ్బందులేవీ లేవన్నారు. అంతా బాగానే జరిగిందని చెప్పారు. కాకపోతే అమ్మాయి తరఫున చిన్న టెన్షన్ ఉందన్నారు.
ఈ సందర్భంగా తాను ప్రేమ పెళ్లి చేసుకున్న అంజన(నాని భార్యపేరు) వాళ్లది సైంటిస్ట్ నేపథ్యం గల ఫ్యామిలీ అని, మొదట తనకు అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచించారని తెలిపారు. ప్రేమ విషయంలో పేరెంట్స్ సానుకూలంగానే ఉన్నారని, కానీ ఆసమయంలో నేను హీరోగా స్ట్రగులింగ్‌లో ఉన్నానని, దీంతో వాళ్లు టెన్షన్ పడ్డారట. ఇవ్వాలా వద్దా అని ఆలోచించారట. ఒక్కసారి అబ్బాయిని చూశాక నిర్ణయించుకుందామని చెప్పారని, తనని చూశాక, తనని కలిశాక మరో ఆలోచన లేకుండా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్టు చెప్పారు హీరో నాని.
నానిది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. అంజనని ఫేమ్ బుక్ ద్వారా కలిశారు నాని. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు నాని. వీరి మ్యారేజ్ 2012లో జరిగింది. వీరికిప్పుడు కుమారుడు జున్ను ఉన్నారు. తన ఇంట్లో తనే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని, ఫ్యామిలీలో ఎవరూ తన అంత బాగా తీయలేరని,అందరి ఫోటోలను తను బాగా తీస్తానని, తనవి మాత్రం ఎవరూ అంతబాగా తీయరని సరదాగా వెల్లడించారు.
ఇక `అంటే సుందరానికి` ప్రమోషన్‌లో భాగంగా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు నాని. టికెట్ల రేట్లపై స్పందిస్తూ, `శ్యామ్ సింగరాయ్` సమయంలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి, వాటితో సినిమా రిలీజ్ అయితే ఎగ్జిబిటర్లు, బతకలేరని, కొంచెం పెంచాలని అన్నట్టు చెప్పారు. అయితే తన వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారీగా పెంచాలని తాను చెప్పలేదన్నారు. ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పడం, సాధారణం కంటే ఎక్కువగా ఉన్న రేట్లని చెప్పారు. తన మాటలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
మరోవైపు నాని.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని, అలాగే విజయ్-వంశీపైడిపల్లి చిత్రంలో నటించబోతున్నారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో అందులో నిజం లేదన్నారు. అవి పుకార్లు మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్నానని, ఇది అత్యంత `రా` గా ఉండే చిత్రమని, తెలుగులో ఇలాంటి సినిమా ఫస్ట్ టైమ్ వస్తుందన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఆతర్వాత మరే సినిమాకి కమిట్ కాలేదని, ఫైనల్ అయ్యాక రివీల్ చేస్తానని తెలిపారు.
`అంటే సుందరానికి` చిత్రంలో మంచి ప్రేమ, హ్యామర్‌తోపాటు తెలియని పెద్ద ట్విస్ట్ ఉంటుందని, కొత్త అంశాలు చాలా ఉంటాయని అవి థియేటర్లో ఆడియెన్స్ కి సర్‌ప్రైజ్‌నిస్తాయన్నారు. దర్శకుడి మేకింగ్, సంగీతం, నజ్రియా నటన హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు.