Nani: తెలివితక్కువ వాళ్లే అలా మాట్లాడేది.. టికెట్ ధరలపై మరోసారి నాని కామెంట్స్

Published : Jun 06, 2022, 03:40 PM IST

అతి వృష్టి అనావృష్టి తో టాలీవుడ్ సతమతమవుతోంది. గతంలో తగ్గించిన టికెట్ ధరలతో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేని పరిస్థితి. దీనితో చాలా కాలం పాటు ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చిన్నపాటి యుద్ధమే చేసింది.

PREV
16
Nani: తెలివితక్కువ వాళ్లే అలా మాట్లాడేది.. టికెట్ ధరలపై మరోసారి నాని కామెంట్స్

అతి వృష్టి అనావృష్టి తో టాలీవుడ్ సతమతమవుతోంది. గతంలో తగ్గించిన టికెట్ ధరలతో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేని పరిస్థితి. దీనితో చాలా కాలం పాటు ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చిన్నపాటి యుద్ధమే చేసింది. టికెట్ ధరల విషయంలో గళం విప్పిన వారిలో నేచురల్ సార్ నాని కూడా ఉన్నారు. 

26

అప్పట్లో నాని టికెట్ ధరల గురించి చేరిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. చాలా మంది నానికి సపోర్ట్ చేస్తే.. కొంతమంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పెంచిన టికెట్ ధరలే టాలీవుడ్ కి శాపంగా మారాయి. 300, 400 టికెట్ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు. దీనితో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి కూడా కలెక్షన్స్ రావడం లేదు. 

36

దీనితో నిర్మాతలు టికెట్ ధరలు తగ్గించి తమ చిత్రాలని రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఆడియన్స్ ఓటిటితో సరిపెట్టుకుంటున్నారు. నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జూన్ 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ మొదలయ్యాయి. 

46

గతంలో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని మీరు మాట్లాడారు.. ఇప్పుడు పెంచిన ధరలతో ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని ప్రశ్నించగా నాని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నన్ను విమర్శించేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. 

56

టికెట్ ధరని రూ 500 పెంచమని నేను అడగలేదు.. కానీ రూ 20, రూ 30 ధరలతో ఇండస్ట్రీ మనుగడ సాధ్యం కాదు అని చెప్పా. అతిగా తగ్గించడం, అతిగా పెంచడం రెండూ తప్పే అని నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

66

ఇదిలా ఉండగా అంటే సుందరానికీ చిత్రంలో నానికి జోడిగా నజ్రియా నటిస్తోంది. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.  ట్రైలర్ లో నాని తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలా మొదలయింది, భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాల మ్యానరిజమ్స్ గుర్తు చేస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories