నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో పాటు ఆకట్టుకునే ప్రేమ కథతో కూడా ఈ చిత్రం డిసెంబర్ 7న అంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి హాయ్ నాన్న చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.