2023లో అత్యధిక వసూళ్లు సాధించిన పది చిత్రాలివే.. ఈఏడాది విన్నర్ ఎవరు? డైనోసార్ ఎంట్రీ ఉంది..

First Published Dec 7, 2023, 5:57 PM IST

2023లో సౌత్, నార్త్ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొన్నటి వరకు ‘జవాన్’, ‘జైలర్’, ‘గదర్2’ దుమ్ములేపాయి. ప్రస్తుతం Animal వసూళ్లు కురిపిస్తోంది. ఇంతకీ 2023లో ఇప్పటి వరకు విన్నర్ ఎవరనేది? టాప్ 10 మూవీ కలెక్షన్లను చూద్దాం.

తమిళ స్టార్ విజయ్ దళపతి(Vijay Thalapathy) నటించిన ‘వరిసు’ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెకన్లను రాబ్టటింది.  
 

బాలీవుడ్ నుంచి వచ్చిన రన్వీర్ సింగ్ - అలియా భట్ మూవీ ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రం మంచి కలెక్షన్లను అందుకుంది. జూలై 28న విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా రూ.355 కోట్లు సాధించింది. 
 

Latest Videos


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’  ప్రేక్షకులను మెప్పించడంతో కాస్తా విఫలమైంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లు రాబ్టటింది. క్లోజింగ్ వరకు రూ. 450 కోట్లు అందుకుంటున్నట్టు ట్రేక్ వర్గాల లెక్కలు. అయినా నిర్మాతకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది. 

ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంటగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘టైగర్3’ మంచి వసూళ్లను రాబట్టింది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో పాటు సాలిడ్ కలెక్షన్లను రాబట్టింది. రూ. 463 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ (Animal The Film)  ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హంట్ కొనసాగిస్తోంది. ఆరు రోజుల్లో రూ.525 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరో 15 రోజుల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరింతగా కలెక్షన్లు రాబట్టనుంది. టాప్ 3కి ఈ చిత్రం చేరుకోనుంది. 

భారీ అంచనాలతో వచ్చిన విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ యాక్షన్ ఫిల్మ్ ‘లియో’ మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద రూ. 620 కోట్ల వరకు వసూళ్ల రాబట్టి  నిర్మాతలకు లాభాలను చేకూర్చింది. టాప్ ఫైవ్ లో ఈ చిత్రం నిలిచింది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ - దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. నిర్మాత కళానిధి సంతోషంతో టీమ్ కు కార్లు, గిఫ్ట్ లు అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. 

సన్నీ డియోల్ ‘గదర్2’ చిత్రం సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించనవి విధంగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.690 కోట్ల వరకు వసూళ్లు దక్కడం విశేషం. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. 
 

ఇక షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’ ఈ ఏడాది అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. టాప్ 2లో కింగ్ ఖాన్ పఠాన్ రూ.1060 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్ల సినిమా ఇదేకావడం విశేషం. 

మరోవైపు ఈఏడాది తను క్రియేట్ చేసిన రికార్డును తానే బ్రేక్ చేశాడు Shah Rukh Khan. ‘జవాన్’తో ఏకంగా రూ.1180 కోట్లు సాధించిన 2023 హయ్యేస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రమే ప్రస్తుతం టాప్ లో ఉంది. మరోవైపు షారుక్ ఈ నెల 21న ‘డుంకీ’తో రానున్నారు... అటు ప్రభాస్ ‘సలార్’తో రాబోతున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు ఒకవేళల ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. 

click me!