Vijayashanti: రాజకీయాల్లో ఫెయిల్, రాములమ్మ అనూహ్య నిర్ణయం!

First Published Dec 7, 2023, 5:46 PM IST

నటిగా విజయశాంతి శిఖరాలు చూసింది. రాజకీయంగా మాత్రం అట్టర్ ప్లాప్. రెండు దశాబ్దాల ఆమె పొలిటికల్ ఎలాంటి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. 
 


లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ ట్యాగ్స్ తో సిల్వర్ స్క్రీన్ ని ఏలింది విజయశాంతి. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. సౌత్ ఇండియాను షేక్ చేసింది. హీరోల సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. 

ఆమె నటించిన కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేసిన విజయశాంతి ఒంటి చేత్తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 

Latest Videos


తమిళనాడు రాజకీయ సంచలనం జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ప్రయాణం సవ్యంగా సాగలేదు. 1998లో విజయశాంతి బీజేపీలో జాయిన్ అయ్యింది. ఆ పార్టీ తరపున స్టార్ కాంపైనర్ గా వ్యవహరించింది. 

బీజేపి పార్టీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి తల్లి తెలంగాణ పేరుతో 2009 సొంత పార్టీ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కి పోటీగా ఈ పార్టీ నిలుస్తుందని పలువురు భావించారు. అయితే పార్టీ నడపడం అంత ఈజీ కాదని తెలుసుకున్న విజయశాంతి తల్లి తెలంగాణను బీఆర్ఎస్ లో విలీనం చేసింది. బీఆర్ఎస్ తరపున ఎంపీ గా గెలుపొందింది. 

కేసీఆర్ తో విభేదాలతో కాంగ్రెస్ గూటికి చేరింది. అప్పటి విజయశాంతి మారిన మూడో పార్టీ అది. కొన్నాళ్ళు కాంగ్రెస్ లో కొనసాగింది. మరలా మనసు మార్చుకొని తన రాజకీయ జీవితం మొదలైన బీజేపీ పార్టీ పంచన చేరింది. 2023 తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ నుండి సీటు ఆశించి భంగపడింది. సీటు రాకపోవడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.. 

ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే క్రియాశీలక నాయకత్వం, ప్రాతినిధ్యం ఆమెకు లేదు. దీంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నటిగా బిజీ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన చేశారు. 

సోషల్ మీడియా వేదికగా.. నన్ను ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెంట ఉన్న అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం మరలా ఓ సినిమా చేస్తున్నాను. 

1979 నుండి ఐదు దశాబ్దాల సినీ గమనంలో మీ దీవెనలు వెన్నంటి ఉంటాయని ఆశిస్తున్నాను, అని ట్వీట్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ తో పాటు దర్శకుడికి, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీలో విజయశాంతి కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. 

ఇకపై రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆమె నటిగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 2006 వచ్చిన నాయుడమ్మ ఆమె చివరి చిత్రం. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీలో ఓ కీలక పాత్ర చేసింది. తర్వాత ఆమెకు ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశారు. 

మారిపోయిన సమంత, కారణం అదేనా... అయితే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?

click me!