Dasara Movie Review: నాని దసరా సినిమా ట్విట్టర్ రివ్యూ..నేచురల్ స్టార్ ప్రయోగం ఫలించిందా, ఆడియన్స్ మాటేంటి..?

First Published | Mar 30, 2023, 4:03 AM IST

సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్. దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. 
 

Dasara Movie Review

నేచురల్ స్టార్ నాని హీరోగా.. కీర్తిసురేష్ హీరోయిన్ గా.. ఇద్దరు తారలు డీగ్లామర్ లుక్ లో నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేలు డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈరోజు( మార్చి 30) శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్అవ్వబోతోంది. అయితే ఈలోపు ఓవర్సిస్ లో.. ప్రీమియర్ షోలు పడగా.. అక్కడ సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయలు ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. మరి ట్విట్టర్ జనాలు ఏమంటున్నారు. నాని ప్రయోగం ఫలించిందా..? 
 

నానీ కీర్తిసురేష్ కు ఇది రెండో సినిమా.. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో.. షూటింగ్ లోకేషన్ లో అల్లరి వాతావరణం.. పండగ వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిస ఆటలు పాటలు.. చిన్న చిన్న తగవులతో దసరా సినిమా షూటింగ్ ను... పండగలా జరుపుకున్నారు.  దాంతో మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఆడియన్స్ నుంచి కూడా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 
 


Dasara

ఇక ఈసినిమా చూసిన ఆడియన్స్ దాదాపు అన్నీ పాజిటీవ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. స్క్రీన్ ప్లే అద్భుతమంటూ రివ్యూ వస్తోంది ఆడియన్స్ నుంచి. ఇక ముఖ్యంగా నాని పెర్ఫామెన్స్ కు వందకు వందా ఇచ్చేస్తున్నారు. అంతే కాదు నానీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు. 

ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల కు మంచి మార్కులు పడుతున్నాయి. కొత్త దర్శకుడైనా అద్భుతంగా తీశాడంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఈసినిమాలో ఎమోషన్స్, యాక్షన్ అదిరిపోయిందంటున్నారు. నానీ ఇంట్రడక్షన్.. సిల్క్ స్మిత ఎపిసోడ్ తో పాటు.. క్రికెట్ ఎపిసోడ్ కూడా అదరిపోయింది అంటున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా నేచురల్ స్టార్ నానీది ఈసినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ అంటున్నారు. 

nani about dasara movie keerthy suresh Srikanth Odela nsn

నేచురల్ స్టార్ నానీ యాక్టింగ్.. ఈసారి మంటలే... కీర్తిసురేష్ బ్రిలియంట్.. ఆమె నటనతో పిచ్చెక్కిస్తోంది.. సినిమా.. మూమూలుగా లేదు.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ట్విస్ట్ అదరిపోయిందంటున్నారు.. ట్విటర్ జనాలు. అంతే కాదు వీళ్ల పెర్ఫామెన్స్ కు.. స్క్రీన్ ప్లేకు.. సంతోష్ నారాయణ బ్యాగ్రౌండ్ స్కోర్ రచ్చ రచ్చ చేసిందంటున్నారు ఆడియన్స్. 

ఇంకొకరు ట్వీట్ చేస్తూ..నాని, కీర్తి సురేష్ చింపేశారు.. బీజియం మంటలు పుట్టిస్తోంది.. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదరిపోయింది..క్లైమాక్స్ అయితే రచ్చ రచ్చ లేపారు.. ఇక మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ముందు 30 నిమిషాలు అయితే.. అల్టిమేట్. టోటల్ గా.. దసరా సినిమా మూమూలుగా లేదు అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాదు 3. 5 రేటింగ్ కూడా ఇచ్చారు

Nani Starrer 'Dasara' Teaser Released

ఓవర్ ఆల్ గా దసరా సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. ట్విట్టర్ లో ప్రతీ ఒక్కరు సినిమాను అద్భుతంగా ఉంది అనేవారే కాని..దసరాపై నెగెటీవ్ కామెంట్స్ పెద్దగా లేవు. కాని ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టించారి.. నిరాశపరిచారని కొన్ని చిన్న చిన్న కామెంట్లు మాత్రమే వినిపించాయి. మొత్తానికి సినిమా మాత్ర వాళ్లు అనుకున్నదానికంటే ఎక్కవ రెస్పాన్స్ నే సాధిస్తోంది. మరి అక్కడే ఈరేంజ్ లో అదరగొట్టిందంటే.. ఇక ఈరోజు థియేటర్లలో రచ్చ రచ్చ చేయబోతుంది దసరా. 
 

పాన్ ఇండియాను ఆకర్షించే అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రీమియర్స్  చూసిన ఆడియన్స్ అన్ని భాషలవారు ఉన్నారు కనుక.. వారంతా మెచ్చిన సినిమా అయ్యింది దసరా. బాలీవుడ్ కు నచ్చబట్టే.. అక్కడి ఆడియన్స్ కూడా ట్విట్టర్ లో సూపర్ అనేస్తున్నారు. మరి థియేటర్లలో దసరా  ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Latest Videos

click me!