Dasara Review:'దసరా' ప్రీమియర్ షో టాక్.. బాక్సాఫీస్ సలాం కొట్టేలా నాని పెర్ఫామెన్స్, అదే చిన్న మైనస్

Published : Mar 30, 2023, 04:02 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముందుగా దసరా చిత్ర సందడి ఓవర్సీస్ లో మొదలయింది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది.

PREV
17
Dasara Review:'దసరా' ప్రీమియర్ షో టాక్.. బాక్సాఫీస్ సలాం కొట్టేలా నాని పెర్ఫామెన్స్, అదే చిన్న మైనస్

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముందుగా దసరా చిత్ర సందడి ఓవర్సీస్ లో మొదలయింది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. నాని ఈ తరహా రగ్గడ్ లుక్ గతంలో ఎప్పుడూ కనిపించలేదు. బాడీ లాంగ్వేజ్ కూడా ఊరమాస్ అన్నట్లుగా ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

27

డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. యుఎస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీనితో దసరా చిత్రానికి సంబంధించిన విశేషాలు బయటకి వస్తున్నాయి. మరి ఏఈ క్రేజీ చిత్రం ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. 

37

వీర్లపల్లికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ మొదలవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం మూమెంట్ మొదలవుతుంది. దీనితో వీర్లపల్లిలో సిల్క్ బార్ విషయంలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడతాయి. ధరణి పాత్రలో నాని, కీర్తి సురేష్, సూరి ఒక గ్రూప్ గా ఉంటారు. కొన్ని సన్నివేశాల తర్వాత వచ్చే ధూమ్ ధామ్ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్, నాని మాస్ స్టెప్పులతో అలరించారు. 

47

ఈ చిత్రంలో నానని నటన పూర్తి భిన్నంగా ఉంటుంది. ధరణి పాత్రలో నాని అందరికి నచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా సాగదీత ఉన్నప్పటికీ కొన్ని మంచి సన్నివేశాలు పడ్డాయి. సెటప్ బావుంది. ఇంటర్వెల్ కి సమీపించే కొద్దీ ఈ చిత్రం మరింత ఇంటెన్స్ గా మారుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం అయితే జస్ట్ స్టన్నింగ్ అనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో బిజియం మోత మోగించారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. 

57

పవర్ ఫుల్ పాయింట్ తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. నాని అండ్ గ్యాంగ్ గట్టిగా కొట్టేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తుంటారు. కీర్తి సురేష్, నాని మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. నాని వైవిధ్యమైన నటనతో సర్ప్రైజ్ చేస్తుంటే.. కీర్తి సురేష్ మాత్రం తన సహజసిద్ధమైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తోంది. ఇద్దరూ పోటీ పడి నటించారు. 

 

67

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూ చిత్రమే అయినప్పటికీ దసరా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం నెక్స్ట్ లెవల్. శ్రీకాంత్ టాలీవుడ్ లో తప్పకుండా కీలక దర్శకుడు అవుతాడనే అంచనాలు అప్పుడే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఎమోషనల్ గా సాగుతుంది. అయినప్పటికీ కథ ఫ్లో మిస్సవ్వదు. దర్శకుడు ప్రేక్షకులని ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో కమాండింగ్ గా ఉంటాయి. 

77

దసరా చిత్రం తప్పకుండా నాని కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కట్టిపడేసే విధంగా ఉంటుంది. ప్రతి విజువల్ ఆకట్టుకుంటుంది. అయితే బిజియం అన్ని సన్నివేశాల్లో వర్కౌట్ కాలేదు. ఇది ఈ చిత్రానికి చిన్నపాటి మైనస్ అని చెప్పొచ్చు. దసరా మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే పొటెన్షియల్ ఉన్న చిత్రం అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి. 

click me!

Recommended Stories