బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గేమ్ రసవత్తరంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈమధ్య లో కన్నడ టీమ్ అంతా కలిసి చేస్తున్న పనులకు ఆడియన్స్ విసిగిపోతున్నారు. నిఖిల్ కోసం యష్మి గౌతమ్ ను అడ్డు పెట్టుకుని బకరాను చేయడం అందరికి చిరాకు తెప్పించింది. అంతే కాదు ఆమె చెప్పే అబద్దాలు కూడా అందరికి అర్ధం అవుతున్నాయి.
అయితే ఈ విషయంలో చాలా ఆవేశంగా ఉన్నాడు గౌతమ్. ఎంత కోపం ఉన్నా.. ఆలోచించి అడుగు వేస్తున్నాడు. ఎవరు రెచ్చగొట్టినా తను అనుకున్న పాయింట్ చెపుతున్నాడు. ఇలానే నామినేషన్స్ లో తనను టార్గెట్ చేసిన కన్నడ బ్యాచ్ కు చుక్కలు చూపించాడు గౌతమ్. ఈ దెబ్బకు నిఖిల్ కు ఏమీ అర్ధం కాలేదు. వాళ్లిద్దరి మధ్య తన గేమ్ పాడవుతుందని రియలైజ్ అయ్యాడు. ఆడియన్స్ లోకి రాంగ్ వెళ్తుందేమ్ అని అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో యష్మి ఆలోచన గురించి కూడా విష్ణు ప్రియ దగ్గర ప్రస్తావించాడు. ఇక గౌతమ్ తాను నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆట ఆడట తనకు ఎంతో ముఖ్యమని అంటున్నాడు. అందుకే నబిల్ తో డీల్ చేసుకుని... గెలవకపోయినా.. టాస్క్ కోసం చాలా కష్టపడ్డారు. రిస్క్ కూడా చేశారు. ఇక మెగా చీఫ్ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ రకరకాల పరీక్షలు పెడుతున్నాడు. బ్రీఫ్ కేస్ గేమ్ ఆడించాడు.
అందులో బిగ్ బాస్ బ్రీఫ్ కేస్ లను నబిల్, పృధ్వీ, రోహిణి తీసుకోగా.. వారు కంటెండర్స్ అయ్యారు. కాని దాన్ని నిలబెట్టుకోవడం కోసం టాస్క్ లు ఆడాల్సి ఉంటుంది. అందులో రెండు టాస్క్ లు కంప్లీట్ అయ్యాయి. ఆ టాస్క్ లలో రోహిణి, నబిల్ గెలుపొందారు. ఇటు కష్టపడి టాస్క్ ఆడుతున్న గౌతమ్ ను ఎవరు సపోర్ట్ చేయడంలేదు అని గంగవ్వ గట్టిగా ఇచ్చుకుంది అందరికి.
మరోవైపు అవినాష్ రోహిణిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం పౌ కూడా గట్టిగా డిస్కర్షన్లు జరుగుతున్నాయి. అంతకంటే సిల్లీ రీజన్స్ తో నామినేషన్స్ లో ఉన్నవారిలో విష్ణు ఉంది, పృధ్వి కూడా ఉన్నాడు. దాంతో అవినాష్ ఇలా చేయడం బయాస్ గేమ్ అన్నట్టుగా ఆడియన్స్ లోకి వెళ్తుంది అన్నట్టు అభాప్రాయాన్నివ్యక్తం చేశారు హౌజ్ లో జనాలు.
ఈవిషయంలో ఎవరికి వారు డిస్కర్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ రెండు రోజులు మెగా చీఫ్ కు సబంధించిన టాస్క్ లు గట్టిగా జరిగే అవకాశం ఉంది. ఎవరు మెగా చీఫ్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అయవుతారు అనేది కూడా హైలెట్ కాబోతోది.