Intinti gruhalakshmi: నందుపై గెలిచిన సామ్రాట్.. తులసిని చూసి కుళ్ళుకుంటున్న లాస్య?

First Published Aug 4, 2022, 1:24 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఎపిసోడ్ ప్రారంభంలోనే... నందు టీం,సామ్రాట్ టీం వంటలు మొదలుపెట్టారు. నందుకి స్టవ్ వెలిగించడం రాకపోతే లాస్య నందు కోసం స్టవ్ వెలిగిస్తుంది.అప్పుడు హనీ ఇది చీటింగ్ , మీరు అంకుల్ కి హెల్ప్ చేయకూడదు అని అంటుంది. అప్పుడు లక్కీ అందులో తప్పేముంది కావాలంటే మీ డాడీకి తులసి ఆంటీని హెల్ప్ చేయమను అని అంటాదడు. లాస్య,తులసి నీ సామ్రాట్ కి సహాయం చేయమని అడుగుతుంది.
 

 అప్పుడు తులసి వెళ్లి సామ్రాట్ కి వంటలో సహాయం చేస్తుంది. వాళ్ళిద్దరి అన్యోన్యతని చూసి నందు లాస్యలు కుళ్ళు కుంటారు. ఈలోగా వంటలన్ని పూర్తవుతాయి. ఇలా కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం అని సామ్రాట్ అనగా,నేను వంట చేయడమే ఇది ఫస్ట్ టైం  నేనెవరికీ చెప్పుకోను అని మనసులో అనుకుంటాడు నందు. ఇంకా  సామ్రాట్ లాస్య తులసిలు జడ్జిమెంట్ మొదలు పెట్టమని అంటాడు.
 

అప్పుడు నందు, నాకు ఇదేమీ నచ్చలేదు. ఆడవాళ్లు వంట చేయాలి మగవాళ్ళు దానికి జడ్జ్ గా ఉండాలి.ఏదో ముచ్చట పడ్డారు కదా అని చేస్తే దానికి రేటింగ్లు ఇవ్వడం ఏంటి? అని మగవాళ్ళమని అహంకారం చూపిస్తాడు.నందు దానికి తులసి మగవాళ్ళు వంట చేయకూడదు అంటే మరి ఆడవాళ్లు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అని అడుగుతుంది. లాస్య మనసులో,సరిగ్గా ఉండకుండా అనవసరంగా తులసిని రెచ్చగొట్టాడు అని నందుని తిట్టుకుంటాది.
 

 ఆడవాళ్ళ గురించి తులసి చెప్పిన మాటలకి అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో అభినందిస్తారు. సామ్రాట్,లాస్యని తులసిని రేటింగ్ ఇవ్వమని అడగగా, ఇప్పుడున్న పరిస్థితులలో మేమిద్దరం కన్నా మా అత్తయ్య మావయ్యలు రేటింగ్ ఇవ్వడమే మంచిది అని అంటుంది తులసి. సామ్రాట్ సరే అని వాళ్ళని రేటింగ్ ఇవ్వమని అంటాడు. తులసి వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరూ వంటలు అన్ని రుచి చూడడం మొదలుపెడతారు.
 

అన్ని వంటలు రుచించిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని చెప్పి ,సామ్రాట్ ని విజేతగా ప్రకటిస్తారు. నందు లాస్యల ముఖం మాడిపోతుంది.ఇంట్లో వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు.సామ్రాట్ ఇది నా ఒక్కడి విజయం కాదు,మీది కూడా తులసి గారు అని అనగా నందు చాలా కుల్లుకుంటాడు. అక్కడున్న వాళ్ళందరూ సామ్రాట్ దగ్గరకు వెళ్లి అభినందిస్తారు. నందు కోపంతో బయటికి వచ్చేస్తాడు.
 

 లాస్య కూడా బయటికి వచ్చి ఎందుకు వచ్చేసావు?ఒక కుకింగ్ కాంపిటీషన్లో ఓడిపోతే ఇంత ఫీల్ అవ్వాలా? అని లాస్య అనగా కుకింగ్ కాంపిటీషన్లో ఓడిపోయినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు.సామ్రాట్ చేతిలో ఓడిపోయినందుకు ఫీలవుతున్నాను అని చెప్పి, అక్కడ సామ్రాట్ తులసితో సరసాలు ఆడుతుంటే నేనిక్కడ మురిసిపోతూ ఉండాలా? అని లాస్య మీద మండిపడతాడు. ఈలోగా సామ్రాట్ నందు ఇక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు అని వెతకడానికి బయటకు వెళ్తాడు.
 

 ఈ లోగా లాస్య, నువ్వు సామ్రాట్ దగ్గర ఓడిపోయినందుకు బాధపడుతున్నావ్ కదా ఈరోజు అయ్యే లోపల ఏదో దాంట్లో సామ్రాట్ మీద నిన్ను గెలిచేలా చేస్తాను అని చెప్పి నందుని లోపలికి తీసుకు వెళుతుంది లాస్య. ఈ లోగ సామ్రాట్  వాళ్ళని చూసి ఏమైపోయారు అని అడగగా ఫోన్ వచ్చింది అందుకే వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్తారు. దాని తర్వాత సామ్రాట్, దివ్య ఇద్దరు చెస్ ఆడతారు. అందరూ ఆ ఆటలో అందరూ పాలుపంచుకుంటారు.
 

 ఈలోగా తులసి అక్కడికి వచ్చి అందరికీ టీలు ఇస్తుంది.అప్పుడు లాస్య నందుతో, ఇదేమైనా తన ఇల్లు అనుకుంటున్నట్టు చూడు ఎంత చలాకీగా తిరుగుతుందో అని అంటుంది. అప్పుడు హనీ,మీరందరూ ఒకటై దివ్య కి సహాయం చేస్తూ మా నాన్నని ఒకల్నే వదిలేశారు. ఇది అన్యాయం అని అనగా లక్కీ ,తులసి ఆంటీ ఖాళీగానే ఉన్నారు కదా మీ డాడీని హెల్ప్ చేయమని అడుగు అని అంటాడు.
 

ఆ మాటలకు నందు మనసు లో చాలా కొప్పడతాడు. నాకు చెస్ రాదు అని తులసి అంటుంది. ఈ లోక సామ్రాట్ ఆ ఆటలో గెలుస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయి, సామ్రాట్ కి ఈ ఆటలే కాదు అన్ని ఆటల్లోనే బహుమతులు సంపాదిస్తాడు  ఆ బహుమతులకి సపరేట్గా ఒక రూమే ఉంటుంది అని అనగా లాస్య,అలా అయితే హ్యాండ్ డరెస్లింగ్ లో కూడా గెలుస్తాడా అని అడుగుతుంది.
 

హ్యాండ్ రెస్లింగ్ అంటే చాలా ఇష్టం మా వాడికి అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.అయితే నందు కి సామ్రాట్ కి పోటీ పెడదాము అని లాస్య అనగా సరే అని అందరూ అంటారు. తులసి మాత్రం కంగారుగా వద్దని అంటుంది.అప్పుడు తులసిని ఆపి వాళ్ళిద్దరి మధ్య పోటీ మొదలు పెడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!