ఎస్ఎస్ రాజమౌళి - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘బాహుబలి’ (Baahubali) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని బాహు, బళ్లాళ, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలు ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఇందులో సీనియర్ నటి రమ్యక్రిష్ణ నటించిన ‘శివాగామి’ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించాల్సి ఉండేదంట.