Intinti Gruhalakshmi: ప్రాణాలతో బయటపడ్డ తులసి.. దీపక్ చెంప చల్లుమనిపించిన నందు?

First Published Jan 9, 2023, 10:03 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య, అంకిత హర్ట్ అయ్యి ఉంటే సారీ అని అంటుంది. అప్పుడు అభి బాధ్యత మీది బరువు మోయాల్సింది మీరు మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు కాదంటారు అని అంటాడు. అప్పుడు నందు ఈ ఇంట్లో అందరూ నా శ్రేయోభిలాషులే అందరూ నా మంచి కోరే వారి అందుకే అందరితో ఈ గుడ్ న్యూస్ ని పంచుకోవాలనుకున్నాను అని అంటాడు. అప్పుడు పరంధామయ్య మంచిపనే రా నువ్వు పైకి ఎదిగితే మాకు కూడా సంతోషమే కదా, కానీ రెక్కలు ఉన్నాయి కదా అని ఒకేసారి ఆకాశాన్ని తాకాలని చూడకు ఉంటాడు.  అది కాదు నాన్న అనడంతో ఫస్ట్ నీ పర్స్ చూపించు అని అనగా నందు పర్సు చూపిస్తాడు.

చూసావా పర్సులో అన్ని వంద కాగితాలు తప్ప ఏమీ లేవు అలాంటిది లక్షలు పెట్టి ఎలా బిజినెస్ లు చేస్తావు అని అంటాడు పరంధామయ్య. ఎక్కడినుంచి చేస్తావు ఎలా చేస్తావో ఒకసారి కాలు జారి కింద పడిపోతే ఏమైపోతావు ఆలోచించావు అని అంటాడు పరంధామయ్య. అప్పుడు నందు చాలా రోజుల నుంచి జాబ్ కోసం ట్రైల్ చేస్తున్నాను నాన్న ఇటువంటి సమయంలో అవకాశం వచ్చింది పిల్లలకు కూడా నేను భారం అవదల్చుకోలేదు తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోలేకపోతున్నాను అని బాధతో మాట్లాడుతాడు. అప్పుడు అమ్మ నువ్వు అయినా నాన్నతో చెప్పు మీ నాన్న నీ విషయంలో అనుమానపడలేదు భయపడుతున్నాడు అంతే అని అనగా నీ మీద నీకు నమ్మకం ఉంటే అలాగే కానీ అంటాడు పరంధామయ్య.

 ఇంతలోనే సామ్రాట్ పరంధామయ్యకు ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి సరస్వతి, దీపక్ వస్తారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి పరిస్థితి ఇంకా క్రిటికల్ గా మారుతుంది పేషంట్ ట్రీట్మెంట్ కి స్పందించడం లేదు మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము అని అంటుంది. ఇలాగే ఉంటే పేషెంట్ కోమా లోకి వెళ్లి ఛాన్స్ ఉంది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు సామ్రాట్ అలా మాట్లాడకండి అనడంతో అంత భయం ఉండేవాళ్ళు మల్లి పేషెంట్ ను ఎందుకు ఒంటరిగా వదిలేశారు అని తిడుతుంది.

ప్రేమ్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి అమ్మకు ఎలా ఉంది అనడంతో దీపక్ సీరియస్ అవుతూ మీలాంటి పిల్లల్ని కన్నందుకు చావాలా బతకాల అని ఆలోచిస్తూ ఉంది వెళ్ళి చూడండి రా అని అనడంతో సామ్రాట్ ఒక్క నిమిషం ఆగు దీపక్ అని అంటాడు. మా అక్కకి వాళ్ళ పిల్లదంటే ప్రాణం అలాంటిది వీళ్ళు గాలికి వదిలేసారు అని దీపక్ సీరియస్ అవుతాడు. మీ అమ్మకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఏ ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేసి ఉన్న ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటాడు. నీకోసం అన్ని చేసిన మీ అమ్మకు మీరు ఇచ్చే బహుమతి మంచానికే పరిమితం చేస్తూ పక్షవాతం వచ్చేలా చేస్తారా అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

అప్పుడు మాకు మా అమ్మ కావాలి అని ప్రేమ్ అనడంతో ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము అని అంటుంది శృతి. అప్పుడు దీపక్ ఆ దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి కదా అని అంటాడు. అప్పుడు సరస్వతి తప్పంతా నాదే ఇల్లు వదిలి వచ్చిన నా కూతుర్ని ఉండమని చెప్పకుండా వెళ్తాను అంటే ఏమి మాట్లాడకుండా వెళ్ళనిచ్చాను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నందు తులసిని ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళమనలేదు అనడంతో వెళ్లేలా మీరే చేశారు. పుట్టింటికి రాను అన్న తులసి అలాంటిది ఇండ్లు వదిలి వెళ్లిపోయేలా మీరే చేశారు అంటుంది సరస్వతి. అప్పుడు సామ్రాట్ ఎవరు మాట్లాడకండి ఇది ఆర్గ్యుమెంట్ చేసుకునే ప్లేస్ కాదు అని అంటాడు.
 

ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి మా ప్రయత్నాలను మేము చేస్తున్నాము వారం దేవుడి మీద వేయండి అనడంతో అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఏమీ కాకూడదు అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ దేవుడి దగ్గరికి వెళ్లి తులసికి ఏం కాకూడదు అని ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు సరస్వతీ దేవుడిని ప్రార్థిస్తూ నీలో ఇంకా ఏమైనా ఆలోచన ఉంటే చెప్పు తులసి బదులు నన్ను పైకి తీసుకుని వెళ్ళు అని ఏడుస్తూ బాధపడుతుంది. అప్పుడు డాక్టర్ బయటికి వచ్చి తులసి క్షేమంగానే ఉంది అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఇక్కడి నుంచి తులసి గారిని క్షేమంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు.
 

ఇంతలోనే అక్కడికి వచ్చి తులసి గారి హస్బెండ్ మీరే కదా అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అనడంతో సామ్రాట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య నర్సు పై సీరియస్ అవుతూ ఎవరు ఏమి అవుతారు ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడండి అనడంతో ఇందాక ఆయనే పేపర్ పై సంతకం పెట్టి హస్బెండ్ గా సైన్ చేసాడు అనడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు లాస్య నందుని రెచ్చగొడుతూ వారి ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెబితే వినలేదు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో అని అంటుంది. ఎవరు నా మాట వినలేదు అందరూ నన్ను శత్రువులా చూసారు అని అంటుంది.

ఇప్పుడేమంటారు మామయ్య అన్నంతో ఇది హాస్పిటల్ లాస్య ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకో అని అంటాడు పరంధామయ్య. అప్పుడు లాస్య అందర్నీ రెచ్చగొడుతూ తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నోటికి వచ్చినట్లు విధంగా వాగుతూ ఉంటుంది లాస్య. అప్పుడు దీపక్ లాస్య మీద ఫైర్ అవడంతో నందు అరుస్తాడు. నా మీద కాదు అరవాల్సింది ఫస్ట్ నీ భార్య మీద అరువు సంస్కారం నేర్పించు అని అంటాడు దీపక్. అయినా కూడా లాస్య నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ నేను సామ్రాట్ మీద మోజు పడ్డాను నాకు ఆయన ఆస్తి కావాలి అని అందరి ముందు ఒప్పేసుకుంటే ఈ బాధలు ఉండవు కదా అని అంటుంది లాస్య.
 

అప్పుడు మా అక్క పేరు ఎత్తడానికి నీకు అర్హత లేదు పరాయి మొగుణ్ణి లాక్కునే నీకు మా అక్క గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు బజారు దానివి అనడంతో నందు దీపక్ చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు సరస్వతి నందు అని పిలవడంతో మాజీ అల్లుని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తారా అంటూ మరింత రెచ్చగొడుతూ ఉంటుంది లాస్య.

click me!