ఎపిసోడ్ ప్రారంభంలో నందుని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది లాస్య. ఆయనని రెచ్చగొట్టొద్దు సమస్యని పరిష్కరించుకునే విధానం ఇది కాదు అంటుంది తులసి. నేను ఇలాగే మాట్లాడుతాను ఏం చేస్తాడు అంటూ పొగరుగా మాట్లాడుతుంది లాస్య. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కోపంగా అరుస్తాడు నందు.