Intinti Gruhalakshmi: నందుని మరింత రెచ్చగొట్టిన లాస్య.. బాధపడుతున్న తులసి కుటుంబ సభ్యులు?

First Published Dec 24, 2022, 11:30 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో పనుందామయ్య చాలా హుషారుగా ఆ పాట పెట్టండి ఫుల్ డాన్స్ చేయాలి అనడంతో అనసూయ అడ్డు పడగానే మౌనంగా ఉండు అని అంటాడు. అప్పుడు దివ్య వదిన సౌండ్ పెట్టు ఈరోజు తాతయ్యో మేము తేలిపోవాలి అని అంటుంది. మళ్లీ సౌండ్ మొదలవడంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు పరందామయ్య చిన్నపిల్లాడిలా దివ్య వాళ్లతో కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా స్టెప్పులు వేస్తుండగా ఇంతలో లాస్య వచ్చి  పాటలు ఆఫ్ చేస్తుంది. ఎందుకు పాటలు ఆఫ్  చేశారు అంటూ దివ్య లాస్య మీద సీరియస్ అవుతూ ఉండగా శృతి వాళ్ళు దివ్యని మౌనంగా ఉండమని చెబుతారు.

ఇది ఇల్లా లేకపోతే రికార్డింగ్ డాన్స్ స్టేజ్ అనుకున్నారా అంటూ లాస్య సీరియస్ అవుతూ ఉండగా నందు అక్కడికి రావడంతో ఏం జరిగింది లాస్య అని అడగగా తప్పంతా ఇంట్లో వాళ్లది అన్నట్టుగా అందుకు లేనిపోని మాటలు అని చెబుతూ ఉంటుంది లాస్య. అప్పుడు దివ్య డాడ్ అది కాదు అని చెప్పబోతుండగా నువ్వు ఆగు దివ్య నువ్వు చెప్పు లాస్య అని అంటాడు. ఆపడం సంగతి పక్కన పెడితే అత్తయ్య మామయ్య కూడా వాళ్లతో కలిసి డాన్సులు వేస్తూ ఫుల్లు సౌండ్ పెట్టారు పిచ్చెక్కుతోంది అని అంటుంది. సౌండ్ ఆఫ్ చేసినందుకు దివ్య నా మీద సీరియస్ అయ్యింది అని లాస్య అనగా నా ఫ్రెండ్స్ ని నువ్వు మధ్యలోకి ఇన్వాల్వ్ చేయొద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది దివ్య.

అప్పుడు నందు దివ్య పెద్దవాలతో మాట రేపు కొంచెం ఎక్స్పెక్ట్ ఇవ్వు అనడంతో అదే మాట ఆవిడకు కూడా చెప్పండి డాడ్ అని అంటుంది. అప్పుడు నందు పిల్లలకు చెప్పాల్సింది పోయి మీరు కూడా గంతులు వేయడం ఏంటి నాన్న మీరు ముందే హార్ట్ పేషెంట్ అని అంటాడు. అసలే నేను చిరాకులో ఉన్నాను ఇండ్లు కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి ప్లీజ్ అని చేతులు జోడించి అడిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. అప్పుడు లాస్య నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరొకవైపు సామ్రాట్, తులసి ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు లాస్య అలసిపోయారా అనడంతో లేదు ఆలోచిస్తున్నాను అని అంటాడు సామ్రాట్.

అప్పుడు ఎవరి గురించి అనడంతో నా గురించే అని అంటాడు సామ్రాట్. అప్పుడు వారిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రోజంతా జరిగిన విషయాలు తలుచుకొని సామ్రాట్ కొన్ని మంచి మాటలు చెప్పడంతో తులసి క్లాప్స్ పొగుడుతూ ఉంటుంది. మరొకవైపు అందరూ ఒకచోట కూర్చుని లాస్య చేసిన పనిని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి దివ్యని ఓదారుస్తూ ఉండగా దివ్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ్ అభి అక్కడికి వచ్చి ఏం జరిగింది అనడంతో నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అని అంటుంది దివ్య.
 

అప్పుడు ఏం జరిగింది అంకిత అనడంతో జరిగింది మొత్తం వివరిస్తుంది అంకిత. దాంతో ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి ఎదురు తిరుగుతాము అని ప్రేమ్ అనడంతో వద్దురా ఇక్కడ పరిస్థితిలో నీకు అర్థం కాలేదు అని అంటాడు పదందామయ్య. మీ డాడీ ని కూడా ఏమి అనద్దు దివ్య మీ డాడ్ ఉద్యోగం లేక చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఉన్నాడు అని అంటాడు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఇలాగే భరిస్తే పోతే నందు దృష్టిలో మనం మరింత చెడ్డవాళ్ళం అవుతాము అని అంటుంది అనసూయ. అప్పుడు పరంధామయ్య ఈ ఇంటి గృహలక్ష్మిని ఇల్లు దాటి వెళ్లిపోయేలా చేసాము ఆ శాపమే మనల్ని ఇప్పుడు వెంటాడుతోంది అని అంటాడు.

మరొకవైపు తులసి దివ్య గురించి ఆలోచిస్తూ కాలేజీ ఫంక్షన్లో దివ్య డాన్స్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చిందో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దివ్య కి ఫోన్ చేస్తుంది. అప్పుడు దివ్య కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకు దివ్య ఫోన్ కట్ చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దివ్యకి ఫోన్ చేయడంతో దివ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు తులసి నీ డాన్స్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని ఫోన్ చేశాను అని అంటుంది. అప్పుడు దివ్య ఏడుస్తూ నువ్వు ఇక్కడ లేకపోతే ఏం బాగోలేదు మామ దిగులుగా ఉంది చాలా బాధగా ఉంది అని అంటుంది. అందరూ ఉన్న అనాధను అన్న ఫీలింగ్ కలుగుతుంది అని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా తులసి దివ్యని ఓదారుస్తుంది. మరొకవైపు పరంధామయ్యకు కడుపులో మంటగా అనిపించడంతో ఇప్పుడే శృతిని ఏదో ఒక స్నాక్ తీసుకోని రమ్మంటాను అనడంతో పరంధామయ్య వద్దు ఇప్పటికే రెండు మూడు సార్లు శృతి నా విషయంలో లాస్యతో మాటలు పడింది వద్దులే అని అంటాడు.
 

ఇంతలోనే అక్కడికి అంకిత వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నారా తాతయ్య అని అంటుంది. ఇప్పుడు అనసూయ అసలు విషయం చెప్పడంతో అంకిత కిచెన్ లోకి వెళ్తుంది ఎవరైనా మన మీద నమ్మకం ఉంచినప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా తాతయ్యకి హెల్త్ అని చెప్పాను కదా మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అంటుంది అంకిత. మూడు గంటలకు ఒకసారి పాలు బిస్కెట్ లాంటివి ఇస్తూ ఉండాలని చెప్పాను కదా అని అంటుంది అంకిత. అప్పుడు శృతి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా అంకిత నేనే ఈసారి పాలు కల్పిస్తాను. ఇంకొకసారి ఇలా చేయకు అని ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంది. అప్పుడు శృతి అసలు విషయం చెప్పడంతో అంకిత షాక్ అవుతుంది. అంకిత కోపంతో బయటికి వెళ్లి నాకు ఫ్రిడ్జ్ కిస్ ఇవ్వాలి అని అంత ఎందుకు అని ప్రశ్నిస్తుంది లాస్య.

click me!