Avatar 2 Collections: తెలుగు స్టేట్స్, ఇండియా కలెక్షన్లు, ఓటీటీ డిటెయిల్స్..

Published : Dec 24, 2022, 10:08 AM ISTUpdated : Dec 24, 2022, 10:49 AM IST

విజువల్‌ వండర్‌గా వచ్చిన అవతార్‌ 2 సినిమా ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో తెలిసిందే. ప్రపంచంలో కనీవినీ ఎరుగనీ రీతిలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లు, ఓటీటీ డిటెయిల్స్ ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి. 

PREV
15
Avatar 2 Collections: తెలుగు స్టేట్స్, ఇండియా కలెక్షన్లు, ఓటీటీ డిటెయిల్స్..

హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మదిలోనుంచి వచ్చిన అద్భుత దృశ్య కావ్యం `అవతార్‌2ః ది వే ఆఫ్‌ వాటర్‌`(Avatar 2) ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. దాదాపు 160 భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా ప్రారంభంలోనే రికార్డులు బ్రేక్‌ చేసింది. అయితే వీకెండ్‌ వరకు సత్తా చాటిన ఈ చిత్రం మండే నుంచి డ్రాప్‌ అవుతూ వస్తోంది. 

25

సినిమాలో కంటెంట్‌ లేకపోవడంతో, ఎమోషన్స్ క్యారీ కాకపోవడంతో అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ సారి దర్శకుడు విజువల్‌ వండర్‌ ని క్రియేట్‌ చేయడంపై పెట్టిన దృష్టి కంటెంట్‌ మీద పెట్టలేదని క్రిటిక్స్ నుంచి వచ్చిన విమర్శ. దీంతో ఆడియెన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఈ చిత్రంలోని కథ భారతీయ మూలాల నుంచే తీసుకున్నా, దాన్ని అంతే భావోద్వేగ భరితంగా ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు. అదే సినిమాకి మైనస్‌. కేవలం విజువల్స్ కోసమే ఈ సినిమాని చూసే పరిస్థితి తలెత్తింది. దీనికితోడు త్రీడీ కలిసొచ్చిన అంశం. విజువల్స్ నిది మరింత గ్రాండియర్‌గా మార్చింది. 
 

35

ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో, ఇండియా వైడ్‌గా, వరల్డ్ వైడ్‌గా ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే..(Avatar 2 Collections) తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా ఎనిమిది రోజులకుగానూ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60కోట్లు(45కోట్ల నెట్‌) వసూలు చేసింది. తమిళంలో 32కోట్లు(24కోట్ల నెట్‌), కర్నాటకలో 32కోట్లు,(24కోట్ల నెట్‌), కేరళలో 17కోట్లు(12కోట్ల నెట్‌), నార్త్ ఇండియాలో 131కోట్లు(90కోట్ల నెట్‌) వసూలు చేసింది. మొత్తంగా ఇది ఇండియాలో రూ.272కోట్లు(198కోట్ల నెట్‌) కలెక్షన్లని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.5500కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. 

45

సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు 5500కోట్లు సాధించగా, ఇప్పటికే లాభాల బాటలో దూసుకుపోతుంది. అయితే మొదటి పార్ట్ `అవతార్‌`ని బీట్‌ చేయడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా 18వేల కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వసూళ్లకి నాలుగు రెట్లు. అది దాదాపు కష్టమనే టాక్‌ ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రం లాంగ్‌ రన్‌లోనూ ఎనిమిది వేల కోట్లు నుంచి పదివేల కోట్లకు వెళ్తే అదే ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

55

మరోవైపు ఓటీటీ డిటెయిల్స్ చూస్తే, ఈ చిత్రం ఇండియాలో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఓటీటీలో రానుందని సమాచారం. ఇండియాలో ఇది భారీ రేట్‌కే అమ్ముడు పోయిందట. అది ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories