Intinti Gruhalakshmi: తులసిని అపార్థం చేసుకున్న నందు.. నందు పై సీరియస్ అయిన అనసూయ?

First Published Jan 28, 2023, 8:56 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో మోహన్ బావ ఆ విషయం పట్టించుకోకపోవడంతో ఇంటితో తెగదెంపులే అయిపోయింది అని ఫిక్స్ అయిపోయింది కానీ నీ ఫోన్ కాల్ మాధవి మనసు మార్చి ఇక్కడకు వచ్చేలా చేసింది అనడంతో వెంటనే తులసి మనిషికి ఇవ్వాల్సిన సమయం లో విలువ ఇవ్వకపోతే మనం ఇద్దామన్న టైంలో అది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు వాళ్లు నందు గురించి నందు పరిస్థితి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. సరే మాధవి పూజకి కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం పదండి అని అక్కడ నుంచి వారిని పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు నందు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినందుకు సంతోష పడుతూ ఉంటాడు. నేను చాలా లక్కీ నేను చెప్పకుండానే నా టాలెంట్ గురించి ఈ కంపెనీ వాళ్లకు తెలిసిపోయింది అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.
 

అప్పుడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి టాలెంటా పాడ ఆ టాలెంట్ మనకు లేదా అని అంటాడు. మరొకవైపు ఇద్దరు వ్యక్తులు నందు ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అతను మనోడికి ఎవరో తులసి ఎంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారు అనడంతో నందు షాక్ అవుతాడు. అతనేం పెద్ద టాలెంట్ కాదు ఇంతకుముందు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించి నెత్తి మీద తడి గుడ్డు వేసుకున్న గురుడు. ఏదో ఒకటి చేసి సీట్లో కూర్చోబెట్టాలి అని టాలెంట్ అనే ముద్ర వేశారు అంతే అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆడదాన్ని అడ్డుపెట్టుకొని సెలెక్ట్ అయ్యాడు ఇది కూడా ఒక టాలెంటేనా అని మాట్లాడడంతో నందు సిగ్గుతో తలదించుకుంటాడు.
 

మరోవైపు హెచ్ఆర్ తో తులసి మాట్లాడుతూ మేడం ఆల్రెడీ నందు గారు మా కంపెనీకి వచ్చారు మీరు చెప్పిన ప్రకారమే జాబ్ ఇస్తాము అనడంతో అప్పుడు తులసి మీకు అన్ని విధాలుగా సెలెక్ట్ అవుతాడు సూట్ అవుతాడు అనుకుంటూనే జాబ్ ఇవ్వండి నేను రికమెండ్ చేశాను అని జాబ్ ఇవ్వద్దు అంటుంది తులసి. అప్పట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ని ఆయన చేతుల్లో పెట్టబోతున్నాం అనడంతో తులసి థ్యాంక్స్ అని చెప్పి సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు తులసి సంతోషపడుతూ ఉంటాడు. మరోవైపు నందు జాబ్ మీద నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
 

ఆ తర్వాత హెచ్ఆర్ దగ్గరికి వెళ్లడంతో నందగోపాలు ఇదిగో మీ అపాయింట్మెంట్ ఆర్డర్ నీ పేపర్ ఇవ్వడంతో నందు ముక్కలు ముక్కలుగా చించేస్తాడు. ఏంటి నందగోపాల్ ఇలా చేస్తున్నారు అనడంతో రికమండేషన్ క్యాండిట్ ని ఎలా పిల్చుకుంటారు అంటూ నందు హెచ్ఆర్ మీద సీరియస్ అవుతాడు. మరొకవైపు తులసి ఇంట్లో పూజకు అని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య తొందరగా పూజ ముగిస్తే ప్రసాదం తినాలి అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తులసి సంక్రాంతి పండుగ గురించి సంక్రాంతి పండుగకు గంగిరెడ్డి ఎందుకు వస్తాడు అన్న విషయం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి పూజ మొదలుపెడతారు. మరొకవైపు నందు జరిగిన విషయాలు తలచుకొని కోపంతో నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. 
 

అప్పుడు ఇంటికి వచ్చాక కాళ్లతో గేటును తన్ని కోపంతో ఇంటికి వస్తాడు. ఆ తర్వాత పూజ పూర్తవడంతో తులసి అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. అప్పుడు తులసి హారతి ఇస్తూ ఉండగా అది చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు తులసి నందుకి హారతి ఇవ్వడానికి వెళ్లగా నందు హారతి పళ్లెం ను విసిరి కొడతాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు పరంధామయ్య బుద్ధుందా హారతిపళ్లెం అలా కింద పడేస్తావా అనడంతో హారతి పవిత్రమైనదే కానీ ఇలాంటి వాళ్ళ చేతిలో ఉండకూడదు అని అంటాడు నందు. తులసి నన్ను మోసంతో గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది తన కీలుబొమ్మలా చేసుకోవాలని చూసింది అంటాడు నందు.
 

మోసంతో తొక్కేయాలని చూసింది అదృష్టంతో తప్పించుకున్నాను అని అంటాడు. ఏమైంది నందు అని లాస్య అడగడంతో జాబు వచ్చేలా చేసి నన్ను జీవితాంతం తన బానిసలా మార్చుకోవాలని చూసింది అని అంటాడు. జాబు ఇస్తున్నారు అంటే నా టాలెంట్ తో అని మురిసిపోయాను కానీ ఈవిడ గారి దయ దాక్షిన్యాలతో ఇస్తున్నారని నాకు తెలిసిపోయింది అనడంతో తులసి షాక్ అవుతుంది. ఆత్మ అభిమానం నీకే కాదు నాకు కూడా ఉంది అందుకే ఆఫర్ ను రిజెక్ట్ చేసి నిన్ను నిలదీద్దామని వచ్చాను అంటాడు నందు. నేను వాళ్లకి జాబ్ ఇవ్వమని చెప్పలేదు. మీకు టాలెంట్  ఉంటేనే ఇవ్వమని చెప్పాను అనడంతో జాబ్ వెతికి పెట్టమని నేను నిన్ను అడిగానా అని అంటాడు నందు. నాకు బతకడం కష్టం అయిపోయింది అని నేను నిన్ను కాళ్లు పట్టుకొని అడిగానా అని అంటాడు నందు.
 

 ఎందుకు నా విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అని సీరియస్ అవుతాడు నందు. తులసీది మీ వరకు మంచి మనసు అయితే నా వరకు కుళ్ళు మనసు అని అంటాడు. దాంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు మాధవి అన్నయ్య వదిన గురించి హద్దు దాటి మాట్లాడుతున్నావు ఎప్పుడు వదిన గురించి నిజాలు తెలుసుకుంటావు అని అంటుంది. నేను కాదు మాధవి మీ వదినకి రియలైజ్ అవ్వాలి నన్ను ఇంట్లో చేతకాని వాడిని చేసింది బయట కూడా అలాగే చేస్తుంది అని అంటాడు నందు. అందరి ముందు చిన్నప్పటినుంచి నేను ఏదో తనని హింసిస్తున్నానో బాధపెడుతున్నాను అని అందరి ముందు మొదటి నుంచి అలాగే ప్రవర్తిస్తోంది అని కోపంతో మాట్లాడుతాడు నందు. అలాగే ప్రేమ్ ని చిన్నప్పటి నుంచి నాకు శత్రువులా తయారు చేసింది అని అంటాడు. నాకు తెలియకుండా నా పిల్లల ముందు నన్ను పూర్తిగా ఒక చేతకాని వాడిని చేసింది అని అనడంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
 

అప్పుడు మోహన్ బావ మాట జారుతున్నావు తర్వాత బాధపడాల్సి ఉంటుంది అనడంతో తులసిని గుడ్డిగా నమ్ముతున్నందుకు మీరందరూ తర్వాత బాధపడతారు అని అంటాడు నందు. ఇప్పుడు నందు నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో తులసి చేతులు జోడించి మహాప్రభు తప్పు నాదే బుద్ధి తక్కువై మీ విషయంలో నేను తల దూర్చాను అని అంటుంది. బుద్ధి తక్కువై ఇలా చేశాను జీవితంలో నేను మీ జోలికి రాను అని అంటుంది తులసి. దాంతో నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

click me!