హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద సక్సెస్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగనుంది. ఈ సక్సెస్ ఈవెంట్ లో సంబరాలు రెట్టింపు అయ్యేలా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా రాబోతున్నాడు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే వేదికపై కనిపించబోతున్నారు.