ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, చక్రపాణి తో మాట్లాడుతూ మాధవి అక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా నాన్న అనడంతో బాగున్నారు. అది సరే నువ్వు రిషి సార్ కి నిజం చెప్పావా లేదా? కావాలంటే నేను వాళ్ళందరికాళ్ళ మీద పడి వాళ్ళ కోపాన్ని పోగొడతానమ్మా అని అనడంతో వాళ్ళందరూ మంచి వాళ్ళ నాన్న ఏవో చిన్న కోపాలు అంతే అనడంతో మరోవైపు రిషి అపార్ధాలు, అలకలు అన్ని అయిపోయాయి డాడ్. అరుచుకున్నాం గొడవ పడ్డాం, అన్ని బాగున్నాయి అనుకుంటే వసుధార ఈ విధంగా చేసింది అని బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఎందుకు డాడీ, నన్ను అందరూ తీసి పారేస్తున్నారు రిషి పనికిరానివాడా, వేస్ట్ ఫెలోనా అని బాధపడుతూ మాట్లాడుతూ ఉండగా వెంటనే మహేంద్ర రిషి ని హత్తుకుని అలా మాట్లాడకు నాన్నా నువ్వు బంగారం రా నిలువెత్తు బంగారం అని అంటాడు.