ఈరోజు ఎపిసోడ్లో తులసి అనసూయను లోపలికి పిలుచుకొని వస్తూ ఉండగా అది చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు అనసూయ ఇంట్లోకి వస్తుండగా ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీలు లేదమ్మా అని గట్టిగా అరుస్తాడు నందు. చిలక్కీ చెప్పినట్టు చెప్పాను మా నాన్న విషయంలో నోరు జారొద్దు అని నాన్న విషయంలో తప్పుగా ప్రవర్తించి నాన్నని ఇంటికి రాకుండా చేశావు అని నందు సీరియస్ అవుతాడు. అప్పుడు ఆయన ఇంటి గడప తొక్కే అంతవరకు నువ్వు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అనడంతో తులసి షాక్ అవుతుంది. అప్పుడు తులసిని నీకు ఇక్కడేం పని అని అరుస్తాడు. అప్పుడు నందు చెప్తే వినపడడం లేదా వెళ్ళిపో,అమ్మ తను ఈ ఇంటి మనిషి కాదమ్మా పరాయి మనిషి అని అంటాడు.