Intinti Gruhalakshmi: దివ్య పెళ్లి బాధ్యత తీసుకున్న నందు.. రాజ్యలక్ష్మి ప్లాన్ తెలుసుకున్న ప్రియ?

Published : Apr 04, 2023, 09:05 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
19
Intinti Gruhalakshmi: దివ్య పెళ్లి బాధ్యత తీసుకున్న నందు.. రాజ్యలక్ష్మి ప్లాన్ తెలుసుకున్న ప్రియ?

ఈరోజు ఎపిసోడ్ లో బసవయ్య రాజ్యలక్ష్మి తో మాట్లాడుతూ దివ్య అంతు చూడకుండా పెళ్లికి ఒప్పుకొని రెండవ తప్పు చేశావు అక్క ఆ విషయం అర్థం అవుతుందా. దద్దోజనం గాడికి ఎవరో ఒక అమ్మాయిని తెస్తావో అనుకుంటే డాక్టర్ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అక్కయ్య అనడంతో అన్ని ఆలోచించే చేశాను అని అంటుంది రాజ్యలక్ష్మి. హలో ప్రియ అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటుంది. హాస్పటల్లోనే దాని గోల భరించలేకపోతున్నావు అలాంటిది ఇంటికి పిలుచుకొని వస్తున్నావు మనందరి పని అయిపోయినట్టే అని బసవయ్య అనడంతో ప్రియ ని పిలుచుకొని రావడం నాకు ఇష్టం లేదు కానీ దివ్యని పిలుచుకుని వచ్చి దాన్ని తుప్పు ఊడగొడతాను దాని సంగతి తేలుస్తాను అని అనడంతో ఆ మాటలు విని ప్రియ షాక్ అవుతుంది.
 

29

ప్రియ మీద కంటే దివ్య మీదనే నాకు కోపం ఎక్కువ ఉంది విక్రమ్ గాడిని అడ్డుపెట్టుకొని దాని అంతు చూస్తాను అని అంటుంది రాజ్యలక్ష్మి. నాకు మంచి చేసిన దివ్య మేడం గారికి ఇలా జరుగుతోందా అని లోలోపల మదన పడుతూ ఉంటుంది ప్రియ. ఎలా అయినా ఈ పెళ్లి ఆపేస్తాను దివ్య మేడంకి అసలు నిజం చెప్పేస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దివ్య పెళ్లి సంబంధం కుదిరినందుకు అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు నందు పెళ్లి కొడుకు మాకు బాగా నచ్చాడు గుడ్ సెలక్షన్ దివ్య అని అంటాడు. ఈ సంబంధ విషయంలో నాకు లాస్య అంటే చాలా మంచి పని చేసి పెట్టింది థాంక్స్ ఆంటీ అనడంతో థాంక్స్ అని నాకు కాదు మీ మమ్మీ డాడీ లకు చెప్పు అని అంటుంది లాస్య.
 

39

అప్పుడు పరంధామయ్య అందరూ ఇంత సంతోషంగా ఉంటుంది నువ్వేంటి అమ్మ పని చేసుకుంటున్నావు అనడంతో అలా చెప్పండి తాతయ్య అని అంటుంది దివ్య. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా మామయ్య మీ మాటలు వింటున్నాను. మీరందరూ పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తే నేను పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు దివ్య తులసి నందుల గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి తండ్రి లేని వాళ్ళ పరిస్థితి ఒక ఎత్తు అయితే తల్లిదండ్రి ఉన్నా కూడా వేరువేరుగా ఉన్న వాళ్ళ పరిస్థితి మరోలా ఉంటుంది తాతయ్య అని అంటుంది.
 

49

నా అదృష్టం మారింది అనుకున్నప్పుడు దురదృష్టం గురించి కూడా తలుచుకోవాలి కదా తాతయ్య అని అంటుంది. అప్పుడు దివ్య మాటలకు తులసి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కోరిక ఏంటో బయటకు చెప్పమ్మా అని అనసూయ అనడంతో తీరుతుందా నానమ్మ అనగా చేయలేకపోయినా దేవుడికైనా వినిపిస్తుంది కదా అని అంటుంది. మా అమ్మ నాన్న పెళ్లి పీటల మీద కూర్చొని నాకు కన్యదానం చేయాలి అనడంతో తులసి,నందు షాక్ అవుతారు. నీ కోరిక ఎవరి చెవినా అయితే పడాలో వారి చెవిన పడింది చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు పరంధామయ్య. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తులసి అక్కడే కూర్చుని జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
 

59

మరోవైపు ప్రియ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కోపం ఉంటే ఇంతలా పగ తీర్చుకోవాలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి పనిమనిషి రావడంతో మొబైల్ ఫోన్ ఇవ్వమని అడగగా అమ్మో నా పని అయిపోతుంది నేను ఇవ్వనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఏదో ఒకటి చేసి దివ్యనీ రక్షించాలి అని సంజయ్ రూమ్ కి వెళ్ళగా అక్కడ సంజయ్ మొబైల్ తీసుకుని ఫోన్ నెంబర్ తెలియదు అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రాజ్యలక్ష్మి వస్తుంది. అప్పుడు ప్రియ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ప్రియ చెంప చెల్లుమనిపిస్తుంది రాజ్యలక్ష్మి. 
 

69

నా హాస్పిటల్లో పనిచేసే నువ్వు నా ఇంటికి కోడలు అయ్యావు ఇప్పుడు పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా, దివ్య నీ అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు కదా అనడంతో లేదు మేడం సంజయ్ నేను తాగే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి  ఆ జీవితాన్ని నాశనం చేశాడు. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు అని అంటుంది ప్రియ. తప్పు చేసిన నిన్ను మందలించకుండా నిన్ను తీసుకువచ్చి మా ఇంటికి కోడలు చేసి మా ఇంటి పరువు బజార్ కి ఈడ్చింది. అలాంటి దాన్ని ఎలా ఒదిలి పెడతారు అనుకున్నావు అని అంటుంది రాజ్యలక్ష్మి. మీ పగ నామీద తీర్చుకోండి దివ్య మేడం జోలికి వెళ్లొద్దు అనగా దెబ్బ తగిలింది పగ తీర్చుకోవాల్సిందే.

79

దాని మీద నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకు అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి బసవయ్య ఇద్దరు ఒక్కటయ్యి దివ్యని నాశనం చేయాలి అందుకే నీతో పాటు ఇంట్లో కోడలిగా అడుగుపెడుతోంది అనడంతో దివ్య కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు తులసి పెళ్లికి ఏడంత ఖర్చు అవుతుంది అని లిస్టు రాస్తూ ఉండగా ఇంతలో అనసూయ అక్కడికి తన బంగారు నగలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ముసలిదాన్ని అయిపోయాను ఇంకా వేసుకోలేను అందుకే ఇక్కడ పెట్టేసాను అని అంటుంది. ఆడపిల్ల పెళ్లి అంటే బాధ్యతతో కూడుకున్న వ్యవహారం అనడంతో అందుకే నమ్మ మేము కూడా మా తరఫున ఒక చిన్న సహాయం చేస్తున్నాము అని అంటారు.
 

89

మోయాల్సిన సమయంలో ఎన్నో బరువు బాధ్యతలు మోసారు అలసిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇవన్నీ మీకు ఎందుకు అత్తయ్య అని అంటుంది. మా ఇబ్బందులు ఏవో మేం పడతాము మమ్మల్ని బాధపడనివ్వండి కష్టపడనివ్వండి మామయ్య అని అంటుంది తులసి. మా పక్కన నిలబడి మంచి చెడు చెప్పడం అండగా నిలవడం చాలు అత్తయ్య అని అంటుంది తులసి. పెళ్ళికూతురు తల్లిగా అవన్నీ నేను చూసుకుంటాను అనడంతో లేదు తులసి పెళ్లి బాధ్యత మొత్తం నాది అని అంటాడు నందు. పిల్లల కోసం కుటుంబం కోసం మా అమ్మ నాన్నల కోసం చాలా ఖర్చు చేశావు.  ఎవరెన్ని చెప్పినా దివ్య పెళ్లి బాధ్యత నాది అనడంతో బాధ్యత నీదే కానీ ఖర్చు నాది అని అంటాడు నందు. ఇక దివ్య పెళ్లి అయిన నా చేతులతో జరపనివ్వు తులసి అడ్డుపడకు ప్లీజ్ అని అంటాడు.
 

99

ఆ నగలు అనసూయకు విచ్చేసి మీరే తీసుకోండి అమ్మ అనడంతో కావాలంటే తీసుకో నందు అనగా మీ ఆశీస్సులు చాలు అని అంటాడు నందు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి నందు పెళ్లి చేస్తాను అని చెప్తున్నాడు కదా అంటే నందు చేతకాని వాడు అనుకుంటున్నారా అని అంటుంది లాస్య. నందు చెప్పినట్టు ఇప్పటికే ఈ ఫ్యామిలీకి చాలా చేశావు ఈ ఒక్కసారైనా నందుకి అవకాశం ఇవ్వు అని అంటుంది. అప్పుడు తులసి సరే అని అంటుంది. తర్వాత రాజ్యలక్ష్మి కాలు మీద కాలు వేసుకుని ప్రియ పని చేస్తూ ఉండగా అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో పనిమనిషి వచ్చి సహాయం చేస్తాను అనగా పనిమనిషి నీ దగ్గరకు పిలిచి వార్నింగ్ ఇస్తుంది రాజ్యలక్ష్మి.

click me!

Recommended Stories