ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు గదికి వెళ్ళగా ఈసారి మళ్లీ వచ్చారు అనగా ఏ రాకూడదా అనడంతో మళ్లీ రావడానికి మళ్లీ ఏదో కారణం ఉందో ఉంటుంది ప్రతిసారి ఉంటుంది. కారణాలు చెప్తే కానీ లోపలికి రానివ్వవా అని అంటాడు రిషి. మళ్లీ థాంక్స్ చెప్పడానికి వచ్చారా సార్ అనగా రెండోసారి థాంక్స్ చెప్పించుకునే అలవాటు నీకు ఏమైనా ఉందా అని అంటాడు రిషి. అని చెప్తారు కానీ ఎందుకు వచ్చాడో చెప్పడు అని వసుధార మనసులో అనుకుంటూ ఉండగా ఇందాక థాంక్స్ చెప్పాను కదా అది తీసుకోవడానికి వచ్చాను అని వసుధారకి దగ్గరగా వెళుతుండగా వసుధార ఇబ్బంది పడుతూ ఉంటుంది.