ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి గారు ఏదో ఆలోచనలో పడ్డారు అని అడగగా ఏం లేదు ప్రేమ్ గుర్తుకు వచ్చాడు వాడి అల్లరి చాలా మిస్ అవుతున్నాను అనడంతో ఇంతలోనే ప్రేమ్ మిస్ అవ్వకూడదనే ఇక్కడికి వచ్చేసాం అనడంతో తులసి అటువైపు చూడగా మొత్తం తన కుటుంబ సభ్యులు అందరూ రావడంతో సంతోష పడద్దు అక్కడికి వెళుతుంది. తులసి ప్రేమగా వెళ్లి శృతిని పలకరించి లోపలికి పిలుచుకుని వస్తుంది. అప్పుడు సామ్రాట్ అక్కడ కోడల్ని దగ్గరికి తీసుకోవడం కుదరకపోయినా ఇక్కడ కుదిరింది కదా అని అంటాడు.