Kajal Thanks Note : భర్తపై ప్రేమను కుమ్మరించిన కాజల్ అగర్వాల్.. గొప్ప భర్త, తండ్రి అంటూ ఎమోషనల్ నోట్..

Published : Apr 14, 2022, 01:27 PM ISTUpdated : Apr 14, 2022, 01:28 PM IST

 హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన భర్తకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. తన డ్యూరింగ్ టైమ్ లో గౌతమ్ కిచ్లులు ఎలా సహకరించాడో గుర్తు చేస్తూ సుధీర్షమైన ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

PREV
17
Kajal Thanks Note : భర్తపై ప్రేమను కుమ్మరించిన కాజల్ అగర్వాల్.. గొప్ప భర్త, తండ్రి అంటూ ఎమోషనల్  నోట్..

ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రెండేండ్ల కిందనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది చివరల్లో కాజల్ ప్రెగ్నెన్సీ ని తెలుపుతూ ఓ ఫోస్ట్ పెట్టింది. 
 

27

అయితే అప్పటి నుంచి కాజల్ ఇంట్లోనే ఉంటోంది. తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఇందుకు స్పెషల్ వర్క్ అవుట్స్, స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు కూడా చేస్తోంది. పౌష్టికాహారం తీసుకుంటూ హెల్త్ ను కాపాడుకుంటోంది.
 

37

కాజల్ చాలా రోజుల నుంచి తన ప్రెగ్నెన్సీ రోజుల గురించి ఎప్పటికప్పడు తన అభిమానులు తెలియస్తూనే  ఉంది. తాజాగా, తన ప్రెగ్నెన్సీ సయమంలో భర్త గౌతమ్ కిచ్లు ఎలా సహకరించాడో తెలియజేసింది. ఈ మేరకు ఎమోషనల్ అవుతూ సుధీర్ఘమైన నోట్ రాసింది. 

47

నోట్ లో..   ‘ఒక అమ్మాయి అడగగలిగే గొప్ప భర్త మరియు కాబోయే తండ్రి అయినందుకు ధన్యవాదాలు. చాలా నిస్వార్థంగా ఉన్నందుకు, నాతో పాటు ప్రతి ఉదయం, రాత్రి  మేల్కొన్నందుకు... నేను ప్రశాంతంగా నిద్రించేందుకు వారాలపాటు నాతో మంచం మీదే విడిది చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

57

నా ఈ ప్రెగ్నెన్సీ బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాల సమయంలో నా ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడినందు.. నన్ను బాధపెట్టకుండా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచినందు.. నాకు బాగా తినిపించినందుకు, బాగా హైడ్రేటెడ్ + సౌకర్యంగా ఉండేలా చూసుకున్నందుకు మరోసారి కృతజ్ఞలు. మన స్వీట్ బేబీ వచ్చే ముందు, మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో మరియు మీరు కూడా అద్భుతమైన తండ్రి అవుతారని నేను తెలుసుకున్నాను. 
 

67

గత 8 నెలల్లో, మీరు అత్యంత ప్రేమగల నాన్నగా మారడం నేను చూశాను. ఈ పాపతో మీరు ఎంత ప్రేమలో ఉన్నారో మరియు మీరు ఇప్పటికే ఎంత శ్రద్ధ వహిస్తున్నారో నాకు తెలుసు- మన బిడ్డను బేషరతుగా ప్రేమించే తండ్రిని కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.  
 

77

ఈ ఘట్టంతో మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు మనకు ఉన్నంత ఒంటరి సమయం ఉండదు- మనం ప్రతి వారాంతంలో సినిమాలకు వెళ్లలేము. లేదా పడుకుని నిద్రపోలేము మరియు అతిగా చూసే షోలు.. ఇకపై మనం బహుశా కాసేపు చూడలేం. ఆకస్మికంగా పార్టీలకూ  వెళ్లలేం. కానీ మన ఇద్దరి హృదయాలను సంతోషంతో నింపే అందమైన పాపను మాత్రం కలిగి ఉంటాం.’ అంటూ ఎమోషనల్ అయ్యింది.

click me!

Recommended Stories